యువ నటుల్లో నందమూరి వారసుల హవా భలే రంజు మీద కొనసాగుతుంది. ఓ పక్క బాబాయ్ కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతుంటే మరో పక్క అబ్బాయిలు కూడా అదరగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రీమిక్స్ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


పూరి మార్క్ మేకింగ్ యాస్పెక్ట్స్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ ను పూర్తిగా మార్చేసిన పూరి అప్పుడెప్పుడో తన ట్విట్టర్లో కళ్యాణ్ రామ్ పిక్ ఒకటి పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక సినిమా ఫీల్ ఎలా ఉండబోతుందో ఆడియెన్స్ కు రుచి చూపించేందుకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. 


ఫిబ్రవరి 5న నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఆరోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా మీద నందమూరి హీరో పూర్తి నమ్మకంతో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ పటాస్ అంటూ తనలోని పవర్ ఫుల్ యాంగిల్ ను బయట పెట్టి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈసారి అంతకంటే ఎక్కువ పవర్ ఫుల్ గా కనిపించనున్నాడట. 


లాస్ట్ ఇయర్ టెంపర్ తో తన పెన్ పవర్ చూపించిన పూరి మరోసారి ఈ సినిమాకు కూడా తన మార్క్ డైలాగ్స్ అందించనున్నాడట. ఇక లోఫర్ ఫ్లాప్ తో కాస్త వెనుకపడ్డ పూరి కళ్యాణ్ రామ్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తన ఖలేజా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. మరి పూరి అనుకున్నది సాధ్యపడిందో లేదో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే.       



మరింత సమాచారం తెలుసుకోండి: