నాగచైతన్య సమంతలు పీకల్లోతు ప్రేమలో పడ్డారన్న విషయం ఓపెన్ సీక్రెట్. వీరి ఇద్దరి పెళ్ళి గురించి ఎప్పుడు అధికారికంగా న్యూస్ బయటకు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే చైతూ సమంతలు ‘కళ్యాణం’ పేరుతో ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ ట్విస్ట్ కు వేదిక అన్న పూర్ణ స్టూడియోస్ కాబోతోంది.

‘సోగ్గాడే చిన్ని నాయన’ తరువాత నాగార్జున తన అన్న పూర్ణ  స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను నాగచైతన్యను హీరోగా చేసి తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కావడంతో మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.

ఇప్పటికే ఈసినిమాలో చైతూ పక్కన సమంత నాల్గవ సారి హీరోయిన్ గా నటిస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు ఎవరూ ఊహించని ఒక షాకింగ్ టైటిల్ పెడుతున్నారు. ‘కళ్యాణం’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ అయినట్లు టాక్. ఈ టైటిల్ ను కూడ చైతూ తానే స్వయంగా సూచించాడు అనే వార్తలు వినపడుతున్నాయి.

తన పై వస్తున్న పెళ్ళి గాసిప్పులకు ఎటువంటి సమాధానం చైతన్య ఇవ్వడం లేదు అని కామెంట్స్ చేస్తున్న వారందరికీ త్వరలో సమంత చైతన్యల ‘కళ్యాణం’ జరగబోతోంది అన్న సంకేతాలు ఇవ్వడానికే ఈ టైటిల్ ను ఫిక్స్ చేసి ఉంటారని అనుకోవాలి. అయితే ఈ ‘కళ్యాణం’ విడుదల అయ్యేదాకా సమంత చైతన్యల పెళ్ళి ఆగుతుందా లేకుంటే ఈలోపే వీరిద్దరి పెళ్ళి జరిగిపోతే ఆ పెళ్ళి సీన్స్ ఈ ‘కళ్యాణం’ సినిమాకు వాడతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: