చిరంజీవి తన సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి కొంత వరకు నష్ట పరుస్తాయి అన్న భయంలో పవన్ వీరాభిమానులు ఉన్నట్లు టాక్. దీనికి కారణం చిరంజీవి తన దర్శకుల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న వ్యుహం పవన్ తన సినిమాల విషయంలో అనుసరించ లేకపోవడంతో టాలీవుడ్ ఎంపరర్ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ తన స్థానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది అని పవన్ అభిమానుల టెన్షన్.

‘అత్తారింటికి దారేది’ సూపర్ సక్సస్ ను పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఉపయోగించు కోకుండా దాదాపు 3 సంవత్సరాలు కాలాన్ని వృథా చేసుకుని ఈ సంవత్సరం సమ్మర్ రేస్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గా వచ్చి ఘోరమైన ఫ్లాప్ ను అందుకుని కూడ పవన్ టాలీవుడ్ లో  తన స్థానం గురించి ఏ మాత్రం పట్టించు కోవడం లేదని పవన్ అభిమానుల వేదన. అంతేకాదు తన తదుపరి చిత్రాల విషయంలో ఎవరికీ అర్ధంకాని నిర్ణయాలు తీసుకుంటూ పవన్ కాలాన్ని గడిపేస్తున్నాడని పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.

ఇది ఇలా ఉండగా చిరంజీవి చాల స్పీడ్ గా తెలివిగా కమర్షియల్ డైరెక్టర్స్ ను లైన్ లో పెడుతూ ‘కత్తిలాంటోడు’ పూర్తి కాకుండానే తన 151వ సినిమాకు బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పవన్ అభిమానులను ఖంగారు పెడుతున్నట్లు టాక్. ఇలా చిరంజీవి వ్యూహాత్మకంగా వరస పెట్టి టాప్ డైరెక్టర్స్ దర్శకత్వంలో కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటే పవన్ మాత్రం తన సినిమాలకు దర్శకులను మార్చుకుంటూ పోతూ తన సినిమాలను తానే అయోమయంలో పడేసుకుంటున్నాడని పవన్ అభిమానుల బాధ.

అంతేకాదు అనేక జాగ్రత్తలతో ఎంతో ఆలోచించి తీస్తున్న చిరంజీవి ‘కత్తిలాంటోడు’ విడుదలై అనుకున్న విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధిస్తే తిరిగి 9 సంవత్సరాల తరువాత చిరంజీవి తన నెంబర్ వన్ పొజిషన్ ను అందుకుంటే ఇప్పటి వరకు టాలీవుడ్ ఎంపరర్ గా కొనసాగుతున్న పవన్ తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అనే భయాన్ని పవన్ అభిమానులు తమలో తాము షేర్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నెంబర్ వన్ స్థానo పట్ల ఎప్పుడూ ఆసక్తి కనపరచని పవన్ తన అభిమానుల బాధను అర్ధం చేసుకుంటాడా అన్నదే సందేహం..


మరింత సమాచారం తెలుసుకోండి: