మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరస విజయాలు సాధిస్తూ ఉండటంతో ఎప్పటికైనా రాజమౌళి స్థానాన్ని త్రివిక్రమ్ ఆక్రమించుకుంటాడా అని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలకు భిన్నంగా దర్శకుడు మారుతి త్రివిక్రమ్ కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగి పోయాడు అని కొందరు ఫిలింనగర్ లో చేస్తున్న కామెంట్స్ షాకింగ్ గా మారాయి.

ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే దర్శకుడు మారుతీ ప్రస్తుతం ఒక సినిమాకు కథ ఇచ్చినందుకు కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నాడు అన్న వార్తల హడావిడి చేస్తున్నాయి. టాలీవుడ్ టాప్ దర్శకుడుగా ఎదిగిన త్రివిక్రమ్ తాను దర్శకుడు కాక ముందు రచయితగా కొన్ని టాప్ హిట్ సినిమాలకు కథలు అందించినప్పుడు అప్పట్లో భారీ పారితోషికం తీసుకున్న రచయితలలో టాప్ వన్ స్థానంలో ఉండేవాడు. 

ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకుడుగా మారిపోయిన తరువాత ఆ స్థానాన్ని కోన వెంకట్ కొరటాల శివలు ఆక్రమించారు. అయితే బూతు దర్శకుడుగా తన కెరియర్ మొదలు పెట్టిన మారుతి ఇప్పుడు టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే రచయితగా మారడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఈవారం విడుదల కాబోతున్న ‘రోజులు మారాయి’ సినిమాకు అదేవిధంగా రాజ్ తరుణ్ హీరోగా త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘రాజుగాడు’ సినిమాలకు కథలు అందించినందుకు మారుతికి ఒకొక్క సినిమాకు కోటి రూపాయల పారితోషికంతో పాటుగా సినిమా లాభాలలో వాటాలు కూడ ఇస్తున్నట్లు వార్తలు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇక మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘బాబు బంగారం’ కూడ అనుకున్న విధంగా సూపర్ హిట్ కొడితే 10 కోట్ల పారితోషికం తీసుకునే డైరక్టర్ల స్థాయిలోకి చేరిపోతాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: