సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం రజినీకాంత్ అభిమానులను కలవర పెట్టడం సర్వసాధారణం. అయితే రజినీకాంత్ తో ఎటువంటి సంబంధంలేని జూనియర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ దర్శకనిర్మాతలను కలవరపెట్టడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆశక్తికరమైన ఈన్యూస్ కు ఒకకారణం ఉంది. కోలీవుడ్ మీడియాలో వస్తున్నవార్తల ప్రకారం జూలై 15న విడుదల అవుతుంది అని ఇప్పటివరకు భావించిన రజినీకాంత్ ‘కబాలి’ మళ్ళీ వాయిదా పడుతోంది.

పైకి ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదు అనివార్తలు వస్తున్నా అసలు కారణంమాత్రం రజినీకాంత్ అనారోగ్యం అనిఅంటున్నారు. ఇప్పటికే ఈసినిమా ఆడియోకు పెద్దగా స్పందన రాని నేపధ్యంలోరజినీకాంత్ అనారోగ్య వార్తలమధ్య రజినీకాంత్ లేకుండా ‘కబాలి’ ని విడుదల చేస్తే ఈసినిమాకు తీవ్రనష్టం జరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో రజినీకాంత్ చెన్నై తిరిగి వచ్చిన తరువాత ఈసినిమాను ఎటువంటి సమస్యలు లేకుండా ఆగష్టు 12న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లుగా కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

ఇప్పుడు ఈన్యూస్ ‘జనతా గ్యారేజ్’ యూనిట్ కు షాకింగ్ న్యూస్ గా మారింది అనిఅంటున్నారు. ఎప్పటినుంచో ఆగష్టు 12 నుంచి రాబోతున్న వరస సెలవలను టార్గెట్ చేస్తూ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడానికి వ్యూహాత్మకంగా ఈసినిమా యూనిట్ తనసినిమా రిలీజ్ ను ఆగుస్ట్ 12న నిర్ణయించుకోవడమే కాకుండా ఆరిలీజ్ డేట్ ను మిస్ కాకుండా చాలాకష్ట పడుతోంది. ఈపరిస్థితులలో ఇప్పుడు ఇలా ఒక పిడుగులా రజనీకాంత్  ‘కబాలి’ నిజంగా ఆగష్టు 12న రిలీజ్ అయితే ‘జనతా గ్యారేజ్’ కి థియేటర్స్ సంఖ్య నుంచి కలెక్షన్స్ విషయంలో వరకు అనేక సమస్యలు ఏర్పడతాయని ఈసినిమా యూనిట్ భయపడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్  నటించిన  భారీబడ్జెట్ సినిమా  ‘మొహంజోదారో’  ఆగష్టు 12న విడుదల అవుతున్న నేపధ్యంలో దీనికితోడు ‘కబాలి’ కూడ తోడైతే ‘జనతా గ్యారేజ్’ పరిస్థితి ఏమిటి అని ఈసినిమా దర్శక నిర్మాతలతో పాటు జూనియర్ కూడ భయ పడుతున్నట్లు టాక్. 
 
ఈవార్తలు ఇలా ఉండగా ఈసినిమాలో వెస్ట్రన్ డ్యాన్స్ ను బేస్ చేసుకుని ఒక సాంగ్ తీశారట. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ అందించిన హైఓల్టేజ్ ఎనర్జీ సాంగ్ కు  బీట్ కి శేఖర్ మాస్టర్ అదిరిపోయే డ్యాన్స్ కంపోజ్ చేయగా జూనియర్ తన స్టెప్స్ తో ఇరగ తీసాడని టాక్. జూనియర్ ఎంత కష్ట పడుతున్న ఒకవైపు హృతిక్ రోషన్ మరో వైపు రజనీ కాంత్ లు జూనియర్ ను తెగభయ పెడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: