సినిమా ఇండస్ట్రీలో అతను ఒక సంచలన దర్శకుడు...ఒకప్పుడు దెయ్యాలు, మాఫిమా సినిమాలపై ప్రయోగాలు చేసి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ చూపించిన దర్శకులు. ఈ మద్య ట్విట్టర్ లో సినిమా,రాజకీయ,క్రీడాకారులపై ఎలా పడితే అలా విమర్శిస్తూ ప్రతిరోజూ సంచలనాలు సృష్టుస్తున్న దర్శకులు ఆ...ఇప్పటికే మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. అవును ఆయనే రాంగోపాల్ వర్మ..క్రియేటీవ్ డైరెక్టర్ గా ఒకప్పుడు మంచి మార్కులు పొంది ఇప్పుడు కాంట్రవర్సీ డైరెక్టర్ గా మిగిలిపోయారు.

తాజాగా ఆయన చిన్న నాటి ఫోటోలో ఎంచక్కా తాత చంకెక్కి ఆయన చేతి మీద చెయ్యివేసి అమాయకంగా చూస్తున్న ఈ చిన్నోడు ఎవరో తెలుసా? మరోవైపు.. రెండు చేతులకు రెండు వాచీల్లాంటివి కూడా కనిపిస్తున్నాయి కదూ. ఇంత అమాయకంగా కనిపిస్తూ, కళ్లకు కాటుక కూడా పెట్టుకున్న ఈ పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం తన సినిమాలతో పాటు ట్వీట్లు, వ్యాఖ్యలతో కూడా సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ.   


మరింత సమాచారం తెలుసుకోండి: