తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు నెంబర్ వన్ హీరో రేస్ లో ఉన్నారు. అయితే గత సంవత్సరం కొరటాల దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే..అంతే కాదు ఈ చిత్రం మహేష్ ని వంద కోట్ల క్లబ్ లో ఉంచింది. ఇక ఈ చిత్రంలో ఉన్న సోషల్ మెసేజ్ తో చాలా మంది లో మార్పు వచ్చింది..అందే కాదు హీరో మహేష్ తన సొంత ఊరు అయిన బుర్రిపాలాన్ని దత్తత తీసుకున్నారు..ఇక తెలంగాణలో కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మద్య కొంత స్టార్ హీరోలు పొలిటికల్ లో కూడా కాస్తో కూస్తో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే..చాలా వరకు సక్సెస్ అయ్యారు. బాలీవుడ్ నుండి మన టాలీవుడ్ వరకు చాలా మంది ఈ లిస్ట్ లో ఉన్నారు.

ఇలాంటి వారిలో తెలుగు హీరో ఎన్టీఆర్, తమిళ హీరో ఎంజీఆర్ లాంటి వారు కొత్త పార్టీ స్థాపించి ముఖ్యమంత్రులుగా ఒక్క వెలుగు వెలిగిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో జయలలిత కూడా రాజకీయాల్లో కీలకంగా మారి, తమిళనాడును ఏలుతున్నారు. మొన్నీమధ్యన పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పేరుతో ఓ పార్టీని పెట్టారు.  అయితే నెంబర్ వన్ రేసులో ఉన్న మహేష్ కొత్త పార్టీ స్థాపిస్తారా..లేదా ఉన్న పార్టీలో చేరుతారా అన్ని చాలా మంది రక రకాలు గా ఊహించుకున్నారు. తాజాగా మహేష్ బాబు పై విలక్షణ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాబు త్వరలోనే జగన్ తో కలిసి రాజకీయాల్లోనూ కాలుమోపనున్నారు అని తెలుస్తోంది. ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ తో కలిసి మహేష్ బాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని చర్చ జరగుతోంది. తాజాగా నిర్వహించిన ఓ ఇంగటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టారు మోహన్ బాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి: