సన్షేనల్ డైరెక్టర్ మారుతి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్‘బాబు బంగారం’. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన షూటింగ్ శరవేంగంగా పూర్తవుతుంది. అయితే  ఈ మూవీ డైరెక్టర్ అయిన మారుతి, తాజాగా తన సొంత బ్యానర్ లో ఓ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శ్రేయాస్ శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన ఈ సినిమా ‘రోజులు మారాయి’. జూలై 1న ఈ సినిమా విడుదల కానుంది.


ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో మారుతి తన అప్ కమింగ్ మూవీ అయిన ‘బాబు బంగారం’ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇవి ఇండస్ట్రీలో హాట్ టాపిక్స్ గా మారుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, వెంకటేష్ మూవీకి తన ఎఫెక్ట్ చాలా తక్కువ ఉందని చెప్పారు. పెద్ద మూవీల సక్సెస్ కంటే చిన్న మూవీలకే ఎక్కువ కష్టపడాలి.


చిన్న మూవీలకి కష్టపడిన దాంట్లో కనీసం 30 శాతం పెద్ద మూవీలకి కష్టపడితే చాలు అంటూ కామెంట్స్ చేశారంట. తన సొంత బ్యానర్ లో వస్తున్న రోజులు మారాయి చిత్రానికి మారుతి బాగా కష్టపడ్డాడని, కానీ ‘బాబు బంగారం’ మూవీకి స్టార్ కాస్టింగ్ ఉంది కాబట్టి తను కొద్దిగా కష్టపడ్డా...ఫలితం ఎక్కువుగా ఉంటుందనేది మారుతి భావన అని అంటున్నారు.


దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరూ ‘బాబు బంగారం’ మూవీ ఫస్ట్ కాపీ ని చూసిన తరువాత దీనిపై నిర్ణయాన్ని తీసుకోవాలని అంటున్నారు. మారుతి ఈ తరహా కామెంట్స్ ని చేసి ఉండాల్సి కాదని ఇండస్ట్రీలో వినపిస్తున్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: