అదేంటీ చిరంజీవి జైలుకు వెళ్లడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..! అవును చిరంజీవి జైలుకు వెళ్తున్నారు..అది కూడా ఖైదీ నెం.150 గా ఇది రియల్ లైఫ్ కాదు రీల్ లైఫ్ లో అవును. చిరంజీవి తన 150 వ చిత్రం ‘కత్తిలాంటోడు’ వివివినాయక్ దర్శకత్వలో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షూటింగ్ సన్నివేశాలకు సంబంధించి కొన్ని ఫోటోలు ఈ మద్య విడుదల చేశారు.   చిరంజీవి రాజకీయాల కాస్త దూరంగా ఊంటూ గత రెండు సంవత్సరాలుగా తన 150 వ చిత్రం గురించి ఊరిస్తూ వచ్చారు. మొదట ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ తో తీయాలనుకున్నా పూర్తి స్థాయిలో అంటే ఠాగూర్ తరహాలో సోషల్ మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నారు.

అందుకే కమర్షియల్ గా కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ గా తీయాలనే ఉద్దేశ్యంతో వివివినాయక్ దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ చిత్రం రైతుల గురించి పోరాడే వ్యక్తి కి సంబంధించింది. అంతే కాదు ఈ చిత్రం తమిళనాడులో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం కొన్ని కీలకమైన సీన్లు హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. ఇక సీన్ విషయాని కొస్తే.. ఇందులో చిరు డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. జైలు నుంచి ఎస్కేప్ అయిన ఖైదీలను ఎలా పట్టుకోవాలన్న ప్లాన్‌లో భాగంగా జైలు అధికారులు చిరు సంప్రదిస్తారు.

ఇందులోభాగంగా వాళ్లకి ప్లాన్ చెబుతూ అక్కడి నుంచి చిరు తప్పించుకునే సన్నివేశం.  ప్రస్తుతం షూటింగ్ చంచల్ గూడ జైలులో తీస్తున్నారు. ఇప్పటివరకు తెరకెక్కించిన సన్నివేశాలు బాగుండడంతో యూనిట్ ఫుల్‌ఖుషీగా వుంది. ఇక్కడి షెడ్యూల్ పూర్తికాగానే రామోజీ ఫిలింసిటీకి యూనిట్ షిప్ట్ కానుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారు మూవీ మేకర్స్. 



మరింత సమాచారం తెలుసుకోండి: