ఓ పక్క మంచు విష్ణు మరో పక్క రాజ్ తరుణ్ లాంటి కుర్ర హీరో ఇద్దరు కలిసి ఈ సమ్మర్ మొదట్లోనే మంచి హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. గుజరాతి సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈడోరకం ఆడోరకం జి.నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేయగా.. ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర నిర్మించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా హెభా పటేల్, సోనారికా బడోరియాలు నటించారు.


కుమారి 21ఎఫ్ సినిమాలో జతకట్టిన రాజ్ తరుణ్, హెబ్భా పటేల్ లు మరోసారి ఈడోరకం ఆడోరకంలో అదరగొట్టారు. ఇక సోనారికా అందాలు కూడా సినిమాకు హైలెట్ అయాయి.. జాదుగాడు, స్పీడున్నోడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనారికా ఈ సినిమాతో మొదటి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.  ఇక మంచు విష్ణు సినిమా మొత్తం నడిపించడం జరిగింది. మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నా ఈ టైంలో వీరిద్దరి క్రేజీ కాంబినేషన్  థియేటర్స్ లో నవ్వులు పండించింది. సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కామెడీ హైలెట్ గా నిలుస్తుంది.  


ఇక ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఘన విజయాన్ని అందుకుంది. ఇక సినిమా కలెక్ట్ చేసీన్ టోటల్ కలక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం : 3.60 కోట్లు, వైజాగ్: 1.95 కోట్లు, ఈస్ట్ : 1.10 కోట్లు, వెస్ట్ : 0.75 కోట్లు, కృష్ణ : 0.80 కోట్లు, గుంటూరు : 1.00 కోట్లు, నెల్లూరు : 0.45 కోట్లు, సీడెడ్ : 2.10 కోట్లు, కర్ణాటక : 0.30 కోట్లు, మిగితా ఏరియాలు : 0.10 కోట్లు, మొత్తం : 12.15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇవే కాకుండా శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా మరింత భారీ మొత్తం సినిమాకు అందించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: