రోజుకో సినిమా రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో సినిమాకో కొత్త భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఇక వీరిలో ఒకటి రెండు సినిమాలకే సర్ధేసే భామలెంతమందో ఏమో కాని ప్రస్తుతం తెలుగు పరిశ్రమ కొత్త చిలుకలతో కళకలలాడుతుంది. 


ఈ సంవత్సరం మొదట్లోనే నేను శైలజతో కుర్రాళ్ల హృదయాలను దోచేసింది కీర్తి సురేష్.. ఎన్నాళ్ల నుండే తన మార్క్ ఎనర్జిటిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు హిట్ ఇచ్చి లక్కీ హీరోయిన్ అయ్యింది. అయితే అదే క్రమంలో తమిళంలో అడుగుపెట్టి సూపర్ క్రేజ్ సంపాదించింది. 


నేను శైలజలో కీర్తి సురేష్ :


ఇక లాస్ట్ ఇయర్ బీరువాతో ఎంట్రీ ఇచ్చి ఈ ఇయర్లో ఏకంగా ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్ మన్ సినిమాల హిట్ తో భలే జోరులో ఉంది సురభి. పాలరాతి శిల్పంగా కనిపించే ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తుంది. 


జెంటిల్ మన్ లో నాని, సురభి :


ఇక ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నటించి మెప్పించిన మాళవికా నాయర్ ఈ ఇయర్ కళ్యాణ వైభోగమే అంటూ నాగశౌర్యతో సందడి చేసింది. అమ్మడు నటన ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. అభినయం గల పాత్రల్లో తన టాలెంట్ చూపిస్తున్న మాళవికా ఇప్పుడు తెలుగులో మరో రెండు సినిమాల్లో నటిస్తుంది.


కళ్యాణ వైభోగమేలో మాళవికా నాయర్ :


ఇక నానితోనే ఎంట్రీ ఇచ్చింది మెహెరిన్ పిర్జాద కౌర్.. మోడల్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కృష్ణగాడి వీర ప్రేమ గాథలో మహాలక్షిగా అదరగొట్టింది. తన మెరుపులతో అలరించిన ఈ చిన్నది త్వరలో మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ తో రాబోతుంది.


క్రిష్ణగాడి వీర ప్రేమ గాథలో మెహేరిన్ :


ఇక ఈ సంవ్త్సరం తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్.. త్రివిక్రం అ ఆలో నాగవల్లి పాత్రలో అమ్మడు కేక పెట్టించింది. ఇక ప్రేమం ఒరిజినల్ లో నటించిన అమ్మడు అదే సినిమా తెలుగు రీమేక్ లో కూడా తన పాత్ర తానే చేస్తుంది.


అఆలో అనుపమ :


మలాయళంలో అభినయంతో అదరగొట్టే నివేదా థామస్ నాని జెంటిల్ మన్ తో తెలుగులో హిట్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలో నానితో పోటీగా నటించిన ఆమెకు అందరి దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు యంగ్ టైగర్ దగ్గర లక్కీ ఆఫర్ ఇచ్చాడని అంటున్నారు. అది త్వరలో తెలుస్తుంది.


జెంటిల్ మన్ లో నివేదా థామస్ :


సో ఈ సంవత్సరం అంతా కొత్త భామల జోష్ తోనే ఆరు నెలల పాటు గడిచింది.. ఈ అందాల భామల కవ్వింతలతోనే కలర్ఫుల్ గా మన సినిమాలు నడుస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ భామ జోరు ఎలా ఉండబోతుందో చూద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: