పవన్ కళ్యాణ్  ఇప్పటివరకు టాలీవుడ్ లో తన స్థానం గురించి కాని వరస పెట్టి సినిమాలు చేసి తన క్రేజ్ మరింత పెంచుకోవాలి అన్న ఉద్దేశ్యాలు కాని ఇప్పటి వరరకు పవన్ ఎప్పుడూ అత్యుత్సాహంతో ప్రదర్శించ లేదు అన్నది వాస్తవం. అయితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫ్లాప్ తరువాత పవన్ ఆలోచనలలో అనేక మార్పులు చోటు చేసుకోవడంతో రాబోయే 2 సంవత్సరాలలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి వీలైనంత ఎక్కువ పారితోషికాన్ని పొందాలి అన్న ఆత్రుతతో పవన్ తన సినిమాల విషయంలో కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ కామెంట్స్ ఇలా రావడానికి గల ప్రధాన కారణం పవన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా బడ్జెట్ 100 కోట్లలో ఉంటుంది అంటూ లేటెస్ట్ గా ఎస్.జె. సూర్యా ఇచ్చిన లీకులు అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు ఎస్.జె. సూర్య స్థానంలో డాలి ప్రవేసించి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మార్పులు జరుగుతున్న నేపధ్యంలో ఇలా హఠాత్ గా ఈసినిమా బడ్జెట్ ఏకంగా  100 కోట్లు అని వార్తలు వస్తూ ఉండటంతో ఈసినిమా రైట్స్ ను కొనుక్కుని ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నష్టాలను పూడ్చుకుందామని ఆశ పడుతున్న బయ్యర్లకు పవన్ లేటెస్ట్ సినిమా బడ్జెట్ పిడుగు లాంటి వార్తగా మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పవన్ కు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రీత్యా 100 కోట్లతో సినిమాను తీస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేసుకోవడానికి పవన్ లేటెస్ట్ మూవీ ‘బాహుబలి’ స్థాయిలో  విజయం సాధించాలని అంత రేంజ్ పవన్ కు ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటూ బయ్యర్లు మధన పడుతున్నట్లు టాక్. అంతేకాదు పవన్ చేసే సినిమాల సంఖ్య భవిష్యత్ లో పూర్తిగా తగ్గించుకుంటూ ఉండటంతో ఈ ఒక్క సినిమా ద్వారానే పవన్ బయ్యర్లను పిండేస్తాడా ? అని భయపడి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాలో హీరోయిన్ గా నటించ వలసి ఉన్న శ్రుతిహాసన్ జూలై మూడవ వారానికి తాను ఫ్రీ అవ్వగలనని సంకేతాలు పంపడంతో ఈసినిమా షూటింగ్ జూలై మూడవ వారం తరువాత ఏ రోజైనా ప్రారంభం కావచ్చు అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాలో శరద్ కేల్కర్ కు విలన్ గా మరోసారి అవకాశం పవన్ ఇచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇదిఇలా ఉండగా ఈసినిమా ‘వీరమ్’ (తెలుగులో వీరుడొక్కడే) కు ఫ్రీమేక్ అని ప్రచారం జరుగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: