నందమూరి యంగ్ హీరోలలో ఉన్నత చదువులు చదువుకున్నది కళ్యాణ్ రామ్ అయినా అదృష్టంలో మాత్రం కళ్యాణ్ రామ్ ఇప్పటికీ వెనకపడే ఉన్నాడు. అతడి కెరియర్ లో చేసిన సినిమాలు చాలానే ఉన్నా హిట్స్ మాత్రం కేవలం రెండే రెండు సినిమాలు మాత్రమే. ‘అతనొక్కడే’ సినిమా సూపర్ హిట్ తరువాత కళ్యాణ్ రామ్ కు మరో హిట్ అందుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. 

గత సంవత్సరం ఊహించని హిట్ గా హడావిడి చేసిన ‘పటాస్’ కళ్యాణ్ రామ్ నే కాకుండా ఆ సినిమా దర్శకుడు అనీల్ రావిపూడిని కూడ వెలుగులోకి తీసుకు వచ్చింది. దర్శకుడు అనీల్ రావిపూడికి కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాలో అవకాశం ఇచ్చినప్పుడే మరో సినిమా కళ్యాణ్ రామ్ తో చేస్తానని అనీల్ రావిపూడి చేత ఈ నందమూరి యంగ్ హీరో ఎగ్రిమెంట్ వ్రాయించుకున్నాడని టాక్. 

‘పటాస్’ తరువాత అనీల్ రావిపూడి సాయి ధరమ్ తేజ్ తో చేసిన ‘సుప్రీమ్’ సినిమా కూడ సూపర్ హిట్ కావడంతో ఈ యంగ్ డైరెక్టర్ వైపు హీరోలు అంతా చూస్తున్నారు.
ప్రస్తుతం హీరో రామ్ ని గుడ్డివాడిగా చూపిస్తానని చెప్పి లేటెస్ట్ మూవీ మొదలు పెట్టి ఆ సినిమా విడుదల కాకుండానే ఆ మూవీ పై క్రేజ్ పెంచాడు అనీల్ రావిపూడి.
అయితే ఇలా వరస పెట్టి సినిమాలు చేస్తున్న అనీల్ రావిపూడి క్రేజ్ ను పరిశీలిస్తున్న కళ్యాణ్ రామ్ కు గతంలో ఈ డైరక్టర్ తనకు వ్రాసి ఇచ్చిన ఎగ్రిమెంట్ గుర్తుకు వచ్చింది అని టాక్. దీనితో కళ్యాణ్ రామ్ తనతో మరో సినిమాను చేమని అనీల్ రావిపూడిని అడగడం ఈ యంగ్ డైరెక్టర్ ఒప్పుకోవడం జరిగి పోయింది అని అంటున్నారు.

రామ్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న కళ్యాణ్ రామ్ ఆ సినిమా పూర్తి అయిన వెంటనే అనీల్ రావిపూడిని లైన్ లో పెట్టడం చూస్తూ ఉంటే కొంచెం ఆలస్యం అయినా కళ్యాణ్ రామ్ కు క్రేజీ డైరెక్టర్లను బుట్టలో పెట్టే లక్షణాలు వచ్చాయి అంటూ సెటైర్లు పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: