ఇద్దరు కలిసి కామెడీ పండించిన సందర్భాలున్నాయి.. కాని ఒకరి కథకు మరొకరు హీరో అవుతున్న క్రేజీ కాంబినేషన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇంతకీ కలిసి నటించిన ఆ ఇద్దరు ఇప్పుడు సినిమా తీస్తున్నారట ఇంతకీ ఎవరంటే అల్లరి నరేష్, కృష్ణ భగవాన్. అల్లరి నరేష్ పక్కన చాలా సినిమాల్లో కామెడీ రోల్ వేసిన కృష్ణ భగవాన్ మరోసారి తన పెన్నుకు పని చెప్పి ఓ కథ సిద్ధం చేశాడు.


అల్లరి నరేష్ హీరోగా అలా ఎలా దర్శకుడు అవీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కృష్ణ భగవాన్ కథ మాటలు అందిస్తున్నారు. జాహ్నవి ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మితమవుతుంది. పరిశ్రమకు రచయితగా పరిచయమై ఆ తర్వాత నటుడిగా మారిన కృష్ణ భగవాన్ ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించారు. అయితే ఇక తాను మరోసారి రచయితగా మారి క్రేజ్ సంపాదించాలనుకుంటున్నాడు.


అల్లరి నరేష్ కు సరిపోయే కథతో దర్శకుడు అవీష్ తో ఈ ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ భగవాన్. ఇక కొంతకామలంగా హిట్ కోసం తహతహలాడుతున్న అల్లరి నరేష్ కు ఈ సినిమా కచ్చితంగా హిట్ ఇస్తుందని అంటున్నారు. అలా ఎలా సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా దర్శకుడు అవీష్ ప్రతిభ కనబడ్డది.


అందుకే ఓ మంచి దర్శకుడితో మంచి ప్రయత్నం చేస్తున్న అల్లరి నరేష్ ఈసారి సరైన హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఓ పక్క కుర్ర హీరోలంతా హిట్లు మీద హిట్లు కొట్టి ఫుల్ ఫాంలో ఉంటే.. స్పూఫ్ సినిమాలను కామెడీ టచ్ ఇస్తూ కామెడీకి కొత్త అర్ధం చెప్పిన అల్లరి నరేష్ మాత్రం హిట్ కేక పెట్టి చాలా రోజులైంది. మరి రాబోయే ఈ సినిమాతో ఆ కోరిక తీరుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: