ఏంటి చైతు, సమంతల లవ్ సక్సెస్ అయినట్టేనా.. త్వరలో వీరిద్దరి పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అంటే దాదాపు అయినట్టే ఉంది పరిస్థితి కాని ఇక్కడ కళ్యాణం అని ప్రస్థావించింది మాత్రం వారిద్దరి పెళ్లి గురించి కాదు. త్వరలో ఇద్దరు కలిసి నటించే సినిమా టైటిల్ గురించి. సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. 


అందులో హీరోయిన్ గా సమంతను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమా టైటిల్ కళ్యాణం అని పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్లో టాక్. ఓ పక్క ఇద్దరి ప్రేమ వ్యవహారం మీద రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తుంటే మరో పక్క ఇద్దరు కలిసి నటించే సినిమాకు కళ్యాణం టైటిల్ పెట్టడంపై అందరికి ఆసక్తి కలుగుతుంది.  


ఏమాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు అప్పటి నుండి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించి మరింత దగ్గరయ్యారు. అయితే ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నా వారిద్దరి మాత్రం బయట పడట్లేదు. ఇక వెనుక మాత్రం పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు టాక్.


మరి ఈ కళ్యాణ తంతులోనే వారి అసలు కళ్యాణం కూడా ప్లాన్ చేస్తారేమో చూడాలి. అయితే ఫిల్మ్ నగర్ నుండి వస్తున్న ఎక్స్ క్లూజివ్ టాక్ ప్రకారం చైతు, సమంతల లవ్ కు నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇక పెళ్లికి కూడా త్వరలో ముహుర్తాలు పెడుతున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: