ప్రస్తుతం కాలీవుడ్ లో అంటే తమిళ సినిమాలో నయనతార హవా నడుస్తోంది. చిన్న హీరోల దగ్గర నుంచీ పెద్ద హీరోల వరకూ మల్టీ స్టారర్ దగ్గర నుంచీ సోలో సినిమాల వరకూ ఆమె చాలా ఉత్సాహంగా సినిమాలు చెయ్యడం విశేషం. నయనతార ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అతిపెద్ద సంచలనం అయితే ఆమె తరవాత స్థానం లో ఉంది అనుష్క. పెద్ద హీరోలు ముఖ్యంగా అజిత్ లాంటి సీనియర్ హీరోల సరసన సరిగ్గా సరిపోయే ఈమె మళ్ళీ కొత్త ఆఫర్ లు పొందుతోంది.

 

 

 అనుష్క పరిస్థితి ఎలా ఉంది అంటే వచ్చిన అన్ని ఆఫర్ లూ ఆమె ఒప్పేసుకుంటే కనీసం నిద్రపోడానికి కూడా కాల్ షీట్ లు ఉండవు. వయసు పెరుగుతున్నా కూడా ఆఫర్ ల విషయం లో ఈ రేంజ్ లో ఉన్న హీరోయిన్ లు నయాతర , అనుష్క ఇద్దరే అని చెప్పచ్చు. వయసు పెరుగుతున్న సమయం లో సినిమా అవకాశాలు సన్నగిల్లుతూ ఉంటాయి. డైరెక్టర్ లు వీరికంటే బెటర్ గా కొత్త భామని ట్రై చేద్దాం అనుకుంటారు కానీ అనుష్క మళ్ళీ మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ సంతకం పెడుతూ సినిమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

 

ప్రస్తుతం అజిత్ యాభై ఏడవ సినిమా డైరెక్టర్ శివ ద్వారా రాబోతోంది. కాలీవుడ్ చరిత్ర లోనే ఇది అతి పెద్ద భారీ బడ్జెట్ చిత్రంగా చెబుతున్నారు. ఈ సినిమాలో అనుష్క అజిత్ తో రోమాన్స్ చెయ్యడానికి సిద్దపడింది.ఇప్పటికే మరో కాలీవుడ్ స్టార్ సూర్య తో సింగం సినిమా మూడవ భాగం ఎస్ 3 లో మెయిన్ హీరోయిన్ గా ఉన్న ఆమె ఈ రెండూ కాకుండా భాగమతి అనే ఫిమేల్ చిత్రం కూడా చేస్తోంది. అన్నిటినీ మించి బాహుబలి సెకండ్ పార్ట్ లో పోరాట యోధురలిగా అదరగొట్ట బోతోంది. ఈ రేంజ్ లో పెద్ద హీరోలతో సినిమాలూ , లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లూ ఇవన్నీ చేతిలో ఉన్న ఏకైక హీరోయిన్ ఆమె ప్రెజెంట్ మరి.

 

సైజు తో తలనొప్పి ..

 

ప్రాజెక్ట్ లు బాగా ఉన్నాయి కానీ ఆమె సైజు సంగతి ఇప్పుడు ఇబ్బంది కరంగా మారింది ఆమెకి. సైజ్ జీరో సినిమా కోసం లావు అయిన అనుష్క ఇప్పటికిప్పుడు వెయిట్ తగ్గాలి అని చూస్తోంది. లైపో ద్వరా బరువు తగ్గాలి అని సలహాలు వస్తున్నా ఇష్టపడని ఆమె యోగా ద్వారానే తగ్గుతాను అంటోంది. స్వయంగా ఒక యోగా టీచర్ అవ్వడం తో ఆ పద్ధతి నే ఫాలో అయ్యింది అనుష్క. స్వీటీ త్వరగా సైజు తగ్గి ఈ షూటింగ్ లు అన్నింటా పాల్గొనాలి అని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: