తెలుగు చలన చిత్రరంగంలో రారాజులా వెలిగిపోయిన మెగాస్టార్ చిరంజీవి దాదాపు పది సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు దూరం అయ్యారు. తాజాగా ఆయన ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు..అయితే చిరంజీవి 150 వ చిత్రం ఇప్పటికే రావాల్సి ఉన్నా..చిరంజీవి ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని తాను తీయబోయే సినిమా సోషల్ మెసేజ్ ఉండాలనే తలంపుతో వాయిదాలు పడుతూ వచ్చింది. తమిళ్ హీరో విజయ్ నటించిన ‘కత్తి’ చిత్రం రిమేక్ చేస్తూ తెలుగు నేటివీటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ‘కత్తిలాంటోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం రైతు సమస్యలపై పోరాడే ఓ సామాన్య వ్యక్తికి సంబంధించిన కథ. ఈ చిత్రాన్ని వివివినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు..ఇక షూటింగ్ పనులు కూడా సాగుతున్నాయి.

వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే చిరంజీవి చిత్రం అనగానే మాస్, కామెడీ, యాక్షన్ అన్నీ మేళవించి ఉంటాయిన కనుకనే ఈ చిత్రంలో మాంచి మాస్ మసాలా సాంగ్ పెట్టాటని చూస్తున్నారట. చిరంజీవి సరసన రాక్ స్టార్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన న‌ర్గీస్ ఫ‌క్రీని క‌త్తిలాంటోడు చిత్రంలో యాక్ట్ చేయించాలని మూవీ యూనిట్ భావిస్తోంది.

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని చేస్తోన్న150వ చిత్రం క‌త్తిలాంటోడు లో హీరోయిన్ గా  అనుష్క యాక్ట్ చేస్తోంద‌నే టాక్ వినిపించినా త‌ర్వాత న‌య‌న‌తార‌, దీపికా ప‌దుకునే పేర్లు కూడా వినిపించాయి. అయితే చిరు పక్కన నటించే అవకాశం ఇంకా పెండిగ్ లోనే ఉంది. చిరు ప్రెస్టీజియ‌స్ మూవీకి ఆయ‌న త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ తేజ్ ప్రొడ్యూస‌ర్ కాగా రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: