బుల్లితెర మీద హల్ చల్ చేస్తున్న రష్మి, సుడిగాలి సుధీర్ లు జబర్దస్త్ షోలో వారి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అనుకుంటున్నారు. ఇక ఈటివి పుణ్యమాని జబర్దస్త్ లో కామెడీతో అలరించిన అందరికి తలా ఒక ప్రోగ్రాం ఇచ్చి ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేసేలా చూస్తున్నారు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ ఢీ జోడికి హోస్ట్ గా అంటే రెండు టీంలు ఉండే జోడికి ఒక టీం కెప్టెన్ గా ఉంటున్నాడు.  


ఇక మరో టీంకు హాట్ బ్యూటీ రష్మి కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ప్రదీప్ యాంకరింగ్ తో నిన్న మొదలైన ఈ షోలో ఒకానొక సందర్భంలో రష్మిని అక్క అనేశాడు సుడిగాలి సుధీర్. సుధీర్, రష్మిల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే గుంటూర్ టాకీస్ లో హీరో సిద్ధార్థ్ తో విచ్చల విడి రొమాన్స్ చేసిన రష్మిని చూసి వెనక్కి తగ్గాడు సుధీర్.


జబర్దస్త్ లో మాత్రం రష్మి మీద సెటైర్స్ వేయడం మాత్రం ఆపలేదు. అయితే ఢీ జోడి స్టార్ట్ అయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరు అది ఢీ స్టేజ్ లా కాకుండా జబర్దస్త్ షో అనుకుని రెచ్చిపోయారు. ఇక మధ్య మధ్యలో ప్రదీప్ తన మార్క్ పంచ్ లు వేస్తూ ఇద్దరికి కంట్రోల్ లో పెట్టే ప్రయత్నం చేశాడు.   


టంగ్ స్లిప్ అయ్యి రష్మి అక్క అనేసిన సుడిగాలి సుధీర్ రష్మి వాళ్ల అక్కకి చెబుతున్నా అంటూ మ్యాటర్ కవర్ చేయబోయాడు. సో అలా సరదాగా ఢీ జోడి మొదటి ఎపిసోడ్ జరిగింది. 12 టీములు ఇద్దరు కెప్టెన్స్ మధ్య జరిగే ఈ డ్యాన్స్ షోలో గెలిచిన జోడికి మంచి బహుమతులు అందివ్వనున్నారు నిర్వాహకులు. ప్రోగ్రాం జడ్జులుగా శేఖర్ మాస్టర్, సదా వ్యవహరిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: