బాలకృష్ణ కి నిన్న జరిగిన ప్రమాదం ఒక్క సారిగా తెలుగు సినిమా ప్రేక్షకులని వణికించింది. కొన్ని కొన్ని మీడియా సంస్థలు మొదట " స్వయంగా కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసిన బాలకృష్ణ " అంటూ న్యూస్ రాసాయి. స్క్రోలింగ్ లో కూడా " డైరెక్ట్ గా డివైడర్ ని గుద్దేసిన బాలయ్య . కారు నడుపుతోంది ఆయనే " అంటూ ఊదరగొట్టాయి. అయితే కాసేపటికి ఆ లైన్ ని తీసేసాయి ఆయా టీవీ ఛానల్స్ .

 

బాలయ్య మీద గౌరవం తోనో లేక ఫాన్స్ హర్ట్ అవుతారు అనో తెలీదు కానీ తీసేశారు మరి. అయితే ఈ విషయం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ " అవును నేనే స్వయంగా కారు నడుపుతున్నాను. స్పీడ్ లో అదుపు తప్పి డివైడర్ కి గుద్దుకుంది ఎవ్వరికీ ఏమీ కాలేదు, కారు రెండు టైర్ లు మాత్రం దెబ్బతిన్నాయి,తండ్రి నందమూరి తారకరామారావు ఆశీస్సులు - తెలుగు ప్రజల ఆశీర్వాదాలు - అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్ష నాకు " అని చెప్పుకుని రావడం విశేషం.

 

సాధారణంగా సెలెబ్రిటీ లు అందరికీ డ్రైవర్ లు ఉంటారు అలాగే బాలయ్య కి కూడా ఉండాలి. మరి ఆయన ఎందుకు స్వయంగా నడిపారు అనేది తెలియడం లేదు. అయితే అ సమయం లో డ్రైవర్ మీద తప్పు నెట్టేస్తూ ఉంటారు సెలెబ్రిటీ లు ఇలాంటి సందర్భాలు బోలెడు. యాక్సిడెంట్ లు అయినా చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా వారి స్థానం లో ఉంది డ్రైవర్ లు అనే అబద్దాలు చెప్పే రోజుల్లో బాలయ్య స్వయంగా తానే డ్రైవింగ్ చేసాను అని చెప్పడం చాలా పెద్ద విశేషం. అలా చెప్పడానికి గట్స్ ఉండలి అంటున్నారు అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: