పవన్ లేటెస్ట్ మూవీలో తన కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించబోతున్న సంగతి ఇప్పటికే ఓపెన్ సీక్రెట్ గా మారిపాయింది. ‘అ ఆ’ ఆడియో ఫంక్షన్ కు పవన్ తన లేటెస్ట్ హెయిర్ స్టైల్ తో వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. పవన్ సినిమాకు దర్శకుడుగా ఎస్.జె. సూర్య స్థానంలో వచ్చిన డాలీ ఈ హెయిర్ స్టైల్ కు మరికొన్ని మార్పులు చేర్పులు సూచిస్తున్నాడని తెలుస్తోంది. 

అయితే పవన్ ఇలా కొత్త హెయిర్ స్టైల్ ఎంచుకోవడం వెనుక ఒక స్ట్రాటజీ ఉంది అని అంటున్నారు. ఇప్పటి దాకా తన లేటెస్ట్ సినిమాలోని పాత్ర స్వభావం రీత్యా పవన్ ఈ హెయిర్ స్టైల్ ను మార్చుకున్నాడు అనుకున్నారు అంతా. అయితే దీని వెనుక ఒక రాజకీయ కోణం కూడ ఉంది అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. 

పవన్ తన కొత్త సినిమా కోసం ఏర్పరుచుకున్నా లుక్ ను తన రాబోయే రాజకీయ ప్రచార సభలలో కూడ కొనసాగిస్తాడట. అంతేకాదు ఈసినిమాలో పవన్ ధరించే పంచెకట్టునే తన భవిష్యత్ రాజకీయ సభలలో కూడ ఉపయోగించాలని పవన్ ఆలోచన. ఈ ఉద్దేశ్యంతోనే పవన్ తన లుక్ ను తన కొత్త సినిమాలో మార్చుకుంటున్నాడు అని అంటున్నారు. 

అంతేకాదు ఈ లుక్ ను చాల వేగంగా జనంలోకి తీసుకు వెళ్ళాలి అంటే బ్రహ్మాస్త్రంగా తన సినిమా లేటెస్ట్ లుక్ మాత్రమే సహకరిస్తుంది అన్న ఉద్దేశ్యంతో పవన్ తన లుక్ లో ఇన్ని భారీ మార్పులు తీసుకు వస్తున్నాడని టాక్. సామాన్యంగా ఇటువంటి పంచెకట్టు లుక్ తమిళ రాజకీయ వేత్తలలో కనిపిస్తూ ఉంటుంది. అయితే రాజకీయ నాయకుల లుక్కులో కూడ తన ప్రత్యేకతను చూపించుకోవడానికి పవన్ ఈ లుక్ ను ఎంచుకున్నాడు అనుకోవాలి. ప్రతి విషయంలోనూ  ప్రత్యేకంగా ఉండే పవన్ కళ్యాణ్ తాను రాజకీయాలలో కూడ చాల విభిన్నంగా ఉండబోతున్నాను అన్న సంకేతాలను ఈ లుక్ ద్వారా ఇస్తున్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: