ఈమధ్య కాలలో చాలామంది అప్ కమింగ్ టాలెంటెడ్ దర్శకులు రచయితలు నాగాచైతన్యను కలిసి వారు చైతూను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథలను వినిపిస్తున్నా చైతన్య మాత్రం ఆ కథల పై ఎక్కువగా మనసు పెట్టకుండా తమిళ మళయాళ భాషల రీమేక్ ల వైపు చూస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో నాగచైతన్యకు టాలీవుడ్ ఒరిజినాలిటీ పై నమ్మకం పోయిందా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఈ వార్తలు ఇలా రావడానికి చాల కారణాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో చాల మంది యంగ్ టాలెంటేడ్ రైటర్స్ మరియు డైరెక్టర్స్ నాగాచైతన్యను కలిసి రకరకాల కథలను వినిపిస్తున్నా వాటిపట్ల చైతూ పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు అని టాక్. కొత్త రచయితలు వ్రాసే కొత్త కథలను నమ్ముకుని సినిమాలు చేసేకన్నా ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం మంచిది అన్న ఆలోచనలలో నాగచైతన్య ఉన్నట్లు సమాచారం. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చైతూ ఈమధ్య కాలంలో కోలీవుడ్ లో విడుదలై సూపర్ సక్సస్ అయిన క్రైం థ్రిల్లర్ ‘మెట్రో’ ను తెలుగులో రీమేక్ చేయడానికి నాగచైతన్య ఆసక్తి కనపరచడమే కాకుండా ఈసినిమాను బాగా రీమేక్ చేయగల దర్శకులు ఎవరు అన్న విషయమై నాగచైతన్య తన సన్నిహితుల అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈసినిమా రీమేక్ రైట్స్ ను కొనడానికి చైతన్య బాగా ఆసక్తి కనపరుస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం చైతన్యకు రీమేక్ లపై ఏర్పడిన క్రేజ్ ను చూస్తూ ఉంటే అతడి మేనమామ వెంకటేష్ బాటలో పయనించి మినుమం గ్యారెంటీ హీరోగా మారాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. అయితే నాగచైతన్య నిర్ణయాలు అన్నీ అతడి ‘ప్రేమమ్’ రిలీజ్ అయిన తరువాత అ సినిమా సక్సస్ ను బట్టి ఆధారపడి ఉంటాయి అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: