నందమూరి సింహం బాలకృష్ణ ఒకవైపు తన 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను చేస్తూనే తాను తరువాత చేయబోయే సినిమాలను ప్రకటిస్తూ హడావిడి సృష్టిస్తున్నాడు బాలకృష్ణ. నిన్న హిందుపురంలో తన ‘రైతు’ సినిమాను అనౌన్స్ చేసి 24 గంటలు గడవ కుండానే బాలకృష్ణ దృష్టి ‘కొండవీటి సింహం’ పై పడింది అని వార్తలు వస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమధ్య ఒక యంగ్ రైటర్ బాలకృష్ణకు ‘కొండవీటి సింహం’ అనే ఒక పవర్ ఫుల్ స్టోరీని వినిపించినట్లు టాక్. బాలయ్యకు ‘సింహ’ అన్నా ‘నరసింహ స్వామి’ అన్నా అతడి మనసు వెంటనే ఎలా పరుగులు తీస్తుందో కనిపెట్టిన ఆ రచయిత వ్యూహాత్మకంగా బాలయ్యను బుట్టలో పెట్టడానికి ఇలా ‘కొండవీటి సింహం’ పేరుతో కథ తయారు చేసి వినిపించాడని టాక్. 

బాలకృష్ణ తన కెరియర్ తొలి రోజులలో తన తండ్రి నందమూరి తారక రామారావు నటించిన సినిమాల టైటిల్స్ తో కొన్ని సినిమాలు చేసినా బాలయ్య నందమూరి సంహంగా మారిపోయిన తరువాత తన తండ్రి టైటిల్స్ తో సినిమాలు చేసిన సందర్భాలు లేవు. అయితే బాలకృష్ణకు ‘కొండవీటి సింహం’ టైటిల్ పై ఉన్న మోజుతో ఆ కథను పూర్తిగా విని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదల అయ్యాక ఆలోచిద్దాం అని సున్నితంగా చెప్పి ఆ రచయితను పంపించి వేసినట్లు టాక్. 

బాలయ్య వరస పెట్టి ఒప్పుకుంటున్న సినిమాల లిస్టును చూస్తూ ఉంటే తన కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే లోపే రకరకాల పాత్రలను చేసి తన ఇమేజ్ ని మరింత పెంచుకుని 2019 ఎన్నికల తరువాత బాలకృష్ణ కూడ పూర్తి రాజకీయాల వైపు వెళ్ళిపోతాడా అనే సందేహాలు కలగడం సహజం..


మరింత సమాచారం తెలుసుకోండి: