పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ షాక్ ఇచ్చాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రసుత్తం త్రివిక్రమ్ తన రీసెంట్ మూవీ అయిన అ..ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ కోలీవుడ్ హీరో సూర్యతో కలిసి నటించాల్సి ఉండగా, ఇంకా ఆ ప్రాజెక్ట్ ఓ కొలిక్కిరాలేదు.


అయితే తనకి పక్కా డేట్స్ ఇచ్చే హీరో పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ అప్రోచ్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే డైరెక్టర్ ఎస్.జె.సూర్య మూవీకి కమిట్ అయ్యాడు. ఆ తరువాత సూర్య డైరెక్టర్ గా తప్పుకుని బాబి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, బాబి మూవీ తరువాత కచ్ఛితంగా త్రివిక్రమ్ తో కలిసి మూవీ చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు.


అందుకు త్రివిక్రమ్ సైతం కమిట్ అయ్యాడు. కానీ తరువాత ఏమైందో తెలియదు కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ ని సైతం త్రివిక్రమ్ చేసే మూడ్ లో లేడు. ప్రస్తుతం చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఓ కథని రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. చిరంజీవి 150వ సినిమా సెట్స్ పై ఉండగానే, తన నెక్ట్స్ మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ అంటూ మార్కెట్ లో టాక్స్ వస్తున్నాయి.


ఈ మధ్య కాలంలో చిరంజీవితో త్రివిక్రమ్ రెండు సార్లు కలిసి కథకి సంబంధించిన లైన్ ని ఫైనలైజ్ చేసుకున్నారంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇక చిరంజీవి మూవీని త్రివిక్రమ్ ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ తో ఇప్పట్లో మూవీ లేనట్టే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కాస్త షాక్ అయ్యాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: