అల్లుశిరీష్  ఏదోవిధంగా  హిట్ కొట్టి   టాలీవుడ్ లో  తన ఉనికిని చాటుకుందామని ప్రయత్నాలు చేస్తూ లేటెస్ట్ గా నటిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ టీజర్ లో అల్లు శిరీష్ ను చూసిన మెగా అభిమానులకు ప్రాణం లేచి వచ్చినంత పని అయింది అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ టీజర్ లో శిరీష్ లుక్ లోను అదేవిధంగా అతడి డైలాగ్ డెలివరీలోను స్పష్టమైన మార్పు కనిపించింది అని మెగా అభిమానులు సంబర పడుతున్నట్లు టాక్. దర్శకుడు పరుశురామ్ తీస్తున్న ఈసినిమా ఫోటోలు ఫస్ట్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు నచ్చడంతో ఈసినిమా పై చాల ఆసలు పెట్టుకున్నాడు అల్లు శిరీష్.

 ఈసినిమాలో అల్లు శిరీష్ లుక్ ను చూస్తూ ఉంటే తన మొదటి రెండు సినిమాలలో తన పై వచ్చిన విమర్శలకు నిరాశ పడకుండా శిరీష్ ఈసినిమా కోసం గట్టి హోమ్ వర్క్ చేసినట్లే తెలుస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈసినిమా కథ పై గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘సోలో’ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి అన్న గాసిప్పులు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి.

ఈ మధ్య కాలంలో లావణ్య త్రిపాఠి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిన నేపధ్యంలో ఆమె అదృష్టాన్ని నమ్ముకుని అల్లు శిరీష్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో సెటిల్ కావడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. లైఫ్‌లో ఎక్కువగా ఎవర్నీ ప్రేమించకూడదు.. మన క్యారెక్టర్లను మనకు తెలీకుండానే చంపేసుకుంటామంటూ శిరీష్ చెపుతున్న డైలాగ్స్ కొంత వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. 

ఈ సినిమాలో శిరీష్ లావణ్య మధ్య డీప్ రొమాన్స్‌ సీన్స్ ఉంటాయి అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాలని కాబోలు ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి ‘తనలో ఏమి చూసి ఇష్టపడుతున్నావు’ అంటే శిరీష్ ‘నీ ఫిగర్ ను చూసి ఇష్టపడుతున్నాను’ అని అనడం బట్టి లావణ్య క్రేజ్ ను శిరీష్ ఎలా ప్రమోట్ చేస్తునాడో అర్ధం అవుతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: