దాదాపు దశాబ్ధ కాలం నుండి వెండితెర మీద తన అందం అభినయంతో అలరిస్తూ వస్తున్న హీరోయిన్ త్రిషకు ఓ లక్కీ ఆఫర్ దక్కింది.. బాలీవుడ్లో బాక్సాఫీస్ షేక్ చేసి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ కూడా దక్కేలా చేసుకున్న కంగన క్వీన్ సినిమా రీమేక్ లో సౌత్ లో ఎంతోమంది హీరోయిన్స్ ను అనుకోగా చివరగా సౌత్ క్వీన్ గా త్రిష ఓకే అయ్యిందట.


సీనియర్ నటి రేవతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తమిళ్ లో త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నారు. అయితే ముందు సౌత్ క్వీన్ గా నయనతారనే అనుకున్నారు కాని ఏమైందో ఏమో కాని నయన్ ను కాదని త్రిషకు ఆ ఆఫర్ దక్కింది. కెరియర్ లో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న త్రిష లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్ అయ్యింది. 


ఇప్పటికే నాయకి సినిమాలో నటించిన త్రిష ఆ సినిమా రిలీజ్ కు ముందే అదే మార్క్ హర్రర్ నేపథ్యంతో మేనక అనే కొత్త సినిమాలో కూడా నటిస్తుంది. ఇప్పుడు క్వీన్ లో కూడా ఛాన్స్ పట్టేసి తన సత్తా చాటుకుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలో నటిస్తూ మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న మిగతా భామలకు కూడా సరైన పోటీ ఇస్తుంది త్రిష. 


ఇక ఎలాగు తమిళ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి అదే తెలుగు డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మహిళ ప్రధాన కథాంశంగా సాగే క్వీన్ సినిమాలో కంగన తో సమానంగా త్రిష నటించి మెప్పిస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం.    



మరింత సమాచారం తెలుసుకోండి: