యంగ్ హీరో నవదీప్ వ్యూహాత్మకంగా అన్నాడో లేక అనాలోచితంగా అన్నాడో తెలియకపోయినా ఈయంగ్ హీరో తన ట్విటర్ లో చేసిన కామెంట్స్ మహేష్ కు షాక్ ఇచ్చాయి అని టాక్. అంతేకాదు ఈ కామెంట్స్ మహేష్ అభిమానుల దృష్టివరకు వెళ్ళడంతో మహేష్ అభిమానులు నవదీప్ పై చాలా కోపంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అసలు మహేష్ ఇలా నవదీప్ కామెంట్స్ పట్ల షాక్ అవడానికి ఒకకారణం ఉంది. 

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బిరుదు లేకుండా టాప్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రామ్ చరణ్ మాత్రమే అనుకోవాలి. ఆఖరికి నాని కూడ ‘నాచురల్ స్టార్’ అవతారం దాల్చిన నేపధ్యంలో చిరంజీవి తనయుడు మాత్రం ఎలాంటి బిరుదు  లేకుండా వెలవెలబోతున్నాడు.  అయితే అంతకుముందు తనకు మెగా అభిమానులు ఇచ్చిన ‘మెగా పవర్ స్టార్’ బిరుదును పవన్ కళ్యాణ్ తో తలెత్తినవిబేధాల నేపధ్యంలో వదులుకున్న నేపధ్యంలో చరణ్ పేరుకు ముందు  ప్రస్తుతం ఎటువంటి టైటిల్ లేదు.

ఈవిషయాన్ని గ్రహించి కాబోలు  నవదీప్ ఉన్నట్లుండి రామ్ చరణ్ ను ఏకంగా ‘సూపర్ స్టార్’ అని పిలిచేసాడు ‘ధృవ’ సినిమాలో చెర్రీతో పాటు ఒక కీలక పాత్ర పోషిస్తున్న నవదీప్ మెగా వారసుడుతో తన అనుభవాలు షేర్ చేస్తూ తాను చరణ్ తో నటిస్తున్న ఒక ఫోటోను పోస్ట్ చేసాడు. అయితే అక్కడితో ఆగకుండా  ‘ఈ మనిషి అద్భుతం అత్యుత్తమ కో సూపర్ స్టార్ ఇతనితో వర్క్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’ అంటూ నవదీప్ తన ఫీలింగ్స్ ను తన  ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. అయితే ఈవిషయమే మహేష్ అభిమానులకు తీవ్రకోపాన్ని తెప్పించింది. 

హీరో నవదీప్ రామ్ చరణ్ ను ‘సూపర్ స్టార్’ అని సంభోదించడం వెనుక కేవలం అది నవదీప్ ఫీలింగ్ మాత్రమేనా? లేక దీనికి వేరే  గ్రౌండ్ వర్క్ జరుగుతోందా ? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు మహేష్ అభిమానులు.  అంతేకాదు ‘సూపర్ స్టార్’ అనే బిరుదు అందరికీ ఇచ్చేది కాదు. దానికి ఒక అర్హత ఉండాలి ఎంతో సాధిస్తే తప్ప ‘సూపర్ స్టార్’ అన్న పిలుపు సాధ్యంకాదు అంటూ నవదీప్ పై మండి  పడుతున్నారు మహేష్ అభిమానులు. ఒకప్పుడు హీరో కృష్ణ అభిమానులు అభిమానంతో తమ హీరోను సూపర్ స్టార్ గా పిలుచుకుంటే ఇప్పుడు ఆ వారసత్వాన్ని మహేష్  కొనసాగిస్తున్నాడు. ఈనేపధ్యంలో నవదీప్ పిలుపు కేవలం  చరణ్ పై అభిమానంతో వచ్చిందా లేక ‘సూపర్ స్టార్’గా రామ్ చరణ్ ను ప్రమోట్ చేస్తారా ? అంటూ మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: