స్టార్ కమెడియన్ కాస్త స్టార్ హీరోగా మారే ప్రయత్నంలో సునీల్ లేని పోని సెంటిమెంట్లు పెట్టు కుంటున్నాడు. సినిమాలు చేస్తున్నా హిట్లు పడక పోవడంతో జాతి రత్నాలను పెట్టుకునేందుకు డిసైడ్ అయ్యాడు సునీల్. మరి సునీల్ హిట్ కోసం ఈ ఉంగరాల రాంబాబుగా మారి అవి పెట్టుకుంటున్నాడా అంటే ఎబ్బే అదేం లేదండి తను తీసే తర్వాత సినిమా టైటిల్ ఇది అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. 


ష్ణాష్టమి ఫ్లాప్ తో ఢీలా పడ్డ సునీల్ ప్రస్తుతం వంశీ కృష్ణ దర్శకత్వంలో జక్కన్నగా రాబోతున్నాడు. అయితే సినిమాల ఫలితాలెలా ఉన్నా సునీల్ వరుస సినిమాలు చేస్తున్నాడు. జక్కన్న రిలీజ్ వెంటనే వీరు పోట్ల దర్శకత్వంలో ఆల్రెడీ సగానికి పెగా పూర్తయిన ఈడు గోల్డ్ ఎహే సినిమా వదిలేందుకు సిద్ధమయ్యాడు.


ఇక ఈ రెండు కాకుండానే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు సునీల్. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ కనబరచిన క్రాంతి మాధవ్ ఈసారి సునీల్ ను ఉంగరాల రాంబాబుగా మార్చుతున్నాడు. ఈ సినిమాను యునైటెడ్ మూవీస్ పతాకంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. 


అయితే అలనాటి కమెడీ యాక్టర్ చలం సంబరాల రాంబాబు సినిమా తీసి హిట్ అందుకున్నాడు. మరి ఇప్పుడు సునీల్ ఉంగరాల రాంబాబుగా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఉంగరాలను మాత్రమే నమ్మే క్యారక్టర్ లో సునీల్ సరదాలను పంచుతాడట మరి సునీల్ నమ్ముతున్న ఈ ఉంగరాలైనా తనకు ఓ మంచి హిట్ ఇస్తాయో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: