'కొరటాల శివ ' ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. రెండే రెండు సినిమాలతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు మనోడు. ముచ్చటగా మూడవ సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్న కొరటాల ఎన్టీఆర్ లోని విభిన్న కోణాన్ని చూపిస్తూ మోహన్ లాల్ లాంట గొప్ప నటుడిని పెట్టుకుని మరీ అద్భుతమైన కథ రాసాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాకి సంబంధించి అద్భుతమైన వ్యాపారం జరుగుతోంది.

 

 దానర్ధం ఎన్టీఆర్ కి కొరటాల శివ స్టామినా కాంబినేషన్ తోడయ్యింది అన్నమాట. టాకీ పూర్తి అయిన జనతా గ్యారేజ్ సినిమా ఇంకొక నెలా రెండు నెలల్లో విడుదల అయిపోతుంది. దీని తరవాత కొరటాల ఎవరితో చేస్తాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. ఒక పక్క రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ లు కనిపిస్తూ ఉండగా మరొక పక్క మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి అనేది కొరటాల శివ ఆలోచనగా చెబుతున్నారు. ఆగస్ట్ నెలాఖరికల్లా ఫ్రీ అయిపోతాడు శివ. అప్పుడు చేతిలో సినిమాలుఏవీ ఉండవు. కానీ రామ్ చరణ్ ఆ టైం లో ధృవ షూటింగ్ లో దాని తరవాత సుకుమార్ సినిమాలో బిజీ గా ఉంటాడు.

మహేష్ బాబు తన మురగదాస్ సినిమా షూటింగ్ లో ఉండిపోతాడు సో కొరటాల శివ ఎన్నాళ్ళు వీరిద్దరిలో ఒకరి కోసం ఎదురు చూస్తాడు అనేది పెద్ద ప్రశ్న . మహేష్ సినిమా పూర్తి అవడానికి ఫిబ్రవరి దాకా అయిపోతుంది, దాని తరవాత జన గణ మన అంటూ పూరీ సినిమా ఒకటుంది. చరణ్  - సుకుమార్ లకి కూడా ఫిబ్రవరి కంటే ఎక్కువ సమయం పడుతుంది. సో కొరటాల కి తప్పక వీరిద్దరిలో ఒకరికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. కొరటాల దగ్గర డీవీవీ దానయ్య ఇచ్చిన అడ్వాన్స్ ఉంది. చెర్రీ కూడా ఈ నిర్మాతకి ఓ సినిమా చేయాల్సి ఉందనే టాక్ ఉంది. మరి కొరటాల-చరణ్.. ఫిక్స్ అవ్వచ్చేమో!


మరింత సమాచారం తెలుసుకోండి: