తన సినిమా అ ఆ విడుదల ముందర వరకూ బాగా ప్రమోట్ చేసింది సమంత. కానీ సినిమా విడుదల అయిన కొన్నాళ్ళకి మీడియా లో కనపడడమే మానేసింది. సక్సెస్ మీట్ తరవాత ఎవ్వరికీ కనపడని ఆమె ఫాన్స్ కి సైతం కోపం తెప్పించింది. ట్విట్టర్ లో ఫాన్స్ ఎంతగా పలకరిస్తూ " ఏమయిపోయావ్ తల్లీ " అని అంటున్నా ఆమె నుంచి సమాధానమే లేదు. సినీ మా అవార్డుల ఫంక్షన్ లో గానీ ఫిలిం ఫేర్ అవార్డుల ఫంక్షన్ లో గానీ సమంత ఎక్కడా కనపడలేదు.

.

ఆమె పెళ్లి రూమర్ లు మీడియా లో స్ప్రెడ్ అవుతూ ఉండడం తో సమంత బయటకి రావడం మానేసింది అన్నారు అందరూ. అయితే ఎక్కడా కనపడని సమంత ఏకంగా సింగపూర్ లో తేలింది సైమా అవార్డుల వేడుక కోసం అక్కడకి వెళ్ళిన ఆమె మీడియా కి పోజులు ఇచ్చింది కూడా. విరబూసిన కురులు.. చేతుల్లేని కుచ్చుల గౌను.. దగదగా మెరుస్తున్న నక్లెస్.. అబ్బో చూడ్డానికి అచ్చం డిస్నీ బొమ్మలా ఉంది సమంత. బార్భీ చెల్లెలిలా అందం విరజిల్లుతూ.. అజంతా శిల్పాల కజిన్ లా ఈ సాయంత్రాన్ని మత్తెక్కించింది.

 

సడన్ గా సమంత అంత అందంగా కనపడ్డం తో ఆమె ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఆమె డిప్రెషన్ లో ఉంది అనీ నాగ చైతన్య తో పెళ్లిని నాగార్జున ఒప్పుకొని కారణంగా ఆమె డిప్రెషన్ లో వెళ్ళిపోయింది అనే న్యూస్ లు వచ్చాయి. ఆమెని చూస్తే మాత్రం అలాంటిదేమీ కనపడలేదు సరికదా ఫుల్ జోష్ తో సైమా అవార్డుల ఫంక్షన్ లో పాల్గొంది ఆమె. సౌత్ ఇండియా లో అత్యంత ప్రభావితం చేసిన స్టార్ హీరోయిన్ గా అవార్డు కూడా గెలుచుకుని సంతోషంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: