వెండి తెర మన్మధుడు నాగార్జున నిర్ణయాలు చాలా వ్యూహాత్మకంగా ఉంటాయి అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఇన్ని వ్యూహాత్మకమైన తెలివితేటలు ఉండి కూడ నాగ్ తన పిల్లలు చైతు అఖిల్ లను తమ సినిమాల విషయంలో ఇంకా సెటిల్ చేయలేక పోతున్నాడు. ముఖ్యంగా అఖిల్ విషయంలో నాగ్ పడుతున్న కన్‌ఫ్యూజన్‌ తన కెరియర్ లో కూడ పడి ఉండడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  దీనితో అఖిల్ సినిమాల విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. 

అయితే తన పిల్లల సినిమాల ఎంపిక విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటూ నాగ్ తనకు ఖాళీ దొరికినప్పుడల్లా యువ దర్శకులు, స్టార్‌ దర్శకుల  చెపుతున్న కధలు వింటున్నాడు. ఈ  పరిస్థితులలో ఈమధ్య ‘మనం’ తరహాలో ఒక కథ విన్నాడట నాగార్జున. ఇంచుమించు ‘మనం’ సినిమాలో ఉన్నంత ఫీల్‌తోపాటు, అంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌, యాక్షన్‌ కి స్కోప్ ఈ కధలో ఉండటంతో ఈ కథ  నాగార్జునకు విపరీతంగా నచ్చినట్లు టాక్. 

అన్నపూర్ణ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో డైరెక్టన్ కోర్సు చేసిన ఒక యంగ్ డైరెక్టర్ ఈకధను నాగార్జునకు వినిపించి నట్లు టాక్. మొదట్లో ఈ కధను వంశీ పైడిపల్లి, హరీష్‌ శంకర్‌లాంటి కొందరు దర్శకులతో చేయించాలని నాగ్ ప్లాన్ చేసినా   ఈ కథను రాసిన కొత్త దర్శకుడితోనే తీస్తే ఎలా ఉంటుంది అని నాగ్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. 

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా దసరా నుండి పట్టాలు ఎక్కే  ఛాన్స్ ఉంది  అని అంటున్నారు.  ప్రస్తుతం తాను రాఘవేంద్రరావు సినిమా ‘నమో వెంకటే సాయ’ సినిమాలో కనిపించే లుక్ తోనే తన పాత్ర నిడివి తక్కువ వుండేలా  చైతూ, అఖిల్‌ల పాత్రలు పెద్దవిగా ఉండేడట్లు మార్చి మరో అక్కినేని ఫ్యామిలీ మూవీకి నాగ్ రంగం సిద్ధం చేస్తున్నాడు అని టాక్. ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో  నాగార్జున మాస్టర్ ప్లాన్ కు టాలీవుడ్ షాక్ అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: