‘మా’ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో చిరంజీవి హంగామను చూసి ‘మా’ ఛానల్ తో అతడికి ఉన్న సాన్నిహిత్యంతో టాప్ రేంజ్ లో మెగా భజన జరిగింది విమర్శలు చేసారు. అయితే ఆ విమర్శలకు చిరంజీవి నిన్న సింగపూర్ లో జరిగిన ‘సైమా’ అవార్డ్స్ వేదిక నుంచి సరైన సమాధానం ఇచ్చాడు. 

‘సైమా’ అవార్డ్స ఫంక్షన్ అంతా చిరంజీవి నామస్మరణతో దద్దరిల్లి పోయింది. సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాదు ఆ కార్యక్రమానికి వచ్చిన హీరోలు హీరోయిన్స్ అంతా మెగా స్టార్ అభిమానులుగా మారిపోయి ‘శంకర్ దాదా జిందాబాద్’ అంటూ ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ వేదిక అదిరిపోయేలా నినాదాలు చేసి హోరిత్తించారు. 

దీనితో అక్కడ జరుగుతున్నది ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షనా లేదంటే చిరంజీవి సత్కార సభ జరుగుతోందా అన్న సందేహం ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ లో ఏర్పడింది. చిరంజీవితో నటించిన ఒకనాటి హీరోయిన్స్ రాధిక సుహాసనీ లతో పాటు అనేక మంది యంగ్ హీరోలు హీరోయిన్స్ కలిసి చేసిన రచ్చ ఆ కార్యక్రమానికి హైలెట్ గా మారింది. 

చిరంజీవి చేతుల మీదుగా ప్రముఖ గాయిని ఎస్. జానకి జీవన సాఫల్య పురస్కారం అందుకోవడమే కాకుండా ఆమె చిరంజీవి కోసం ఒక పాట పాడటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. సుహాసిని పాట అలీ మిమిక్రీలతో ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ కళకళలాడి పోయింది. దక్షిణాది సినిమా రంగానికి చెందిన అనేక మంది సినిమా సెలెబ్రెటీలు పాల్గొన్న ఈ ఫంక్షన్ లో చిరంజీవి ‘కత్తిలాంటోడు’ విశేషాల గురించి మాట్లాడుకున్నారు అంటే మెగా స్టార్ రేంజ్ ఏమిటో ఆ ‘సైమా’ అవార్డ్స్ లో కూడ మరోసారి రుజువైంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: