చిన్న సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన మారుతి, ఇప్పుడు పెద్ద చిత్రాలతో స్టార్ డం ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్ట్ చేస్తున్న మూవీ బాబు బంగారం. ‘భలే భలే మగాడివోయ్’ సూపర్ హిట్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మారుతి, విక్టరీ వెంకటేష్‌‍ మూవీకి పని చేస్తూ వీరి కాంబినేషన్ తో ఇండస్ట్రీకి హిట్ ని ఇవ్వాలని చూస్తున్నాడు.


ప్రస్తుతం ‘బాబు బంగారం’ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఈ మూవికి సంబంధించిన కథ విషయంలో ఇంకా కొంత అనుమానాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి. ఆగిపోయిన ‘రాధా’ సినిమాకు కాస్త కామెడీని జోడించి తీస్తున్న మూవీనే ‘బాబు బంగారం’ అంటూ కథనాలు వస్తున్నాయి.


దీనికి మారుతి క్లారిటి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పలుసార్లు మారుతి ఈ విషయంపై క్లారిటి ఇచ్చినప్పటికీ...ఈ తరహా కామెంట్స్ మాత్రం ఎక్కడా ఆగటం లేదు. చిత్ర యూనిట్ నుండే బాబు బంగారం కథపై కొంత అనుమానాలు లేవనెత్తటమే ఇందుకు కారణం అని అంటున్నారు.


ఏదైమైనా బాబు బంగారం మూవీకి సంబంధించి కథ విషయంలో మారుతి క్లారిటీ ఇచ్చుకునే తిప్పలు...రిలీజ్ వరకూ ఆగవు అని అంటున్నారు. ఇక ఈ మూవీలో వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అలాగే జూలై 29న ఈ సినిమా థియోటర్స్ ని హిట్ చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: