పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చారు అంటే, దాన్ని కచ్ఛితంగా నెరవేర్చుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో దానికి సమయం ఎక్కువుగా పట్టవచ్చు. కానీ ఫైనల్ గా మాత్రం తను ఇచ్చిన కోరికను మర్చిపోకుండా వారికి నెరవేర్చటం ఖాయం. ఆ విధంగానే పవన్ కళ్యణ్ ఇప్పుడు మరో యాక్టర్ కి ఇచ్చిన కోరికను ఏమాత్రం సమయం తీసుకోకుండానే నెరవేర్చుతున్నాడు.

అయితే ఇది తప్పు అని చాలా మంది అంటున్నారు. ఫిల్మ్ ఇండస్రీలో వినిపిస్తున్న దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ...ఈ మూవీలోని కొన్ని పాత్రలు ఇండస్ట్రీలో హైలెట్ గా నిలిచాయి. ఇందులో విలన్‌గా నటించిన శరత్ కెల్కర్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.

దీంతో శరత్ కెల్కర్‌ కి మరో అవకాశం ఇస్తానని పవన్ కళ్యాణ్ అప్పుడే చెప్పాడంట. ఇందుకు మరో సినిమాలో ఛాన్స్ రావచ్చని శరత్ కెల్కర్‌ సైతం అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు పవన్ కొత్త సినిమాలోనే శరత్ కెల్కర్‌ కి అవకాశం దక్కింది.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విలన్ గా శరత్ కెల్కర్‌ ఉండటం అనేది పవన్ కళ్యాన్ రాంగ్ డెసిషన్ అని ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ వరుస మూవీల్లో విలన్ ఒకరే ఉండటం...అటు సినిమాకి, ఇటు ఫ్యాన్స్ కి రొటీన్ లా ఉంటుందని అంటున్నారు. మార్కెట్ పరంగానూ ఇది ఏమంత కమర్షియల్ పాయింట్ కాదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: