యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ హీరోకి సాధ్యంకాని ఒక క్రేజీ రికార్డ్‌ని సొంతం చేసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే ఈరికార్డును జూనియర్ అభిమానులు తమ అభిమాన హీరోకోసం క్రియేట్ చేసారు. తమ అభిమాన హీరో తమ పై చూపిన ప్రేమకు కృతజ్ఞతగా ఈరికార్డును జూనియర్ ఖాతాలోకి తెచ్చి పెట్టారు.  

ఇక ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే  జూనియర్ ఈమధ్య తన ఫ్యాన్స్ ని కలవడానికి వారితో ఎక్కువ సేపు గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నా తన కోసం షూటింగ్ స్పాట్‌కి వచ్చిన ఫ్యాన్స్‌ని కలవడంతో పాటుగా వారితో వరసగా ఫోటోలు తీయించుకున్న సంగతి తెలిసిందే. ఇలా గత కొన్ని నెలలుగా తారక్ తన ఫ్యాన్స్‌ కి ప్రేమను పంచుతున్నాడు. 

దీనికి ఫిదా అయి పోయిన జూనియర్ అభిమానులు తమ హీరో తమ పై చూపించిన ప్రేమకు ప్రతి స్పందనగా తాము ఎన్టీఆర్ తో  తీయించుకున్న ఫోటోలను నెట్ లో పెడుతూ ‘థాంక్ యూ తారక్’ అనే హ్యాష్ ని మొదలుపెట్టారు.  జూనియర్ అభిమానులంతా ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ పెట్టిన ‘థాంక్యూ తారక్’ అనే హ్యాష్‌ టాగ్‌ కొద్ది గంటల సమయంలోనే అది దేశవ్యాప్తంగా ట్రెండ్ గా మారిపోవడం అందరికీ   షాక్ ఇచ్చింది. జూనియర్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ రీత్యా ఈ ట్యాగ్ మొదలెట్టగానే అది నేషనల్ ట్రెండింగ్ గా మారిపోయింది. ఇలా ఒక హీరో ట్విటర్‌లో ట్రెండ్ అవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఇది ఒక అరుదైన రికార్డు అని అంటున్నారు. 

టాప్ హీరోల చిత్రాలకు సమ్మర్ టైంలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినా   జూనియర్ మాత్రం ఎండని కూడా లెక్క చేయకుండా ‘జనతా గ్యారేజ్’  షూటింగ్ ను పరుగులు తీయించి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈషూటింగ్ అంతా పూర్తి కావడంతో ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగం అందుకున్నాయి. 100 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా దూసుకు వస్తున్న ఈసినిమా బీజినస్ అత్యoత భారీ స్టాయిలో జరగడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు జూనియర్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: