మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు తీపి కబురు అందించారు..వివివినాయక్ దర్శకత్వంలో చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘కత్తిలాంటోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా ఈ విషయాన్ని వాయిదాలు వేస్తూ వచ్చిన చిరంజీవి మొత్తానికి ఈ సినిమా మొదలు పెట్టేశారు. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది..ప్రస్తుతం చెంచల్ గూడా జైలులో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని డైలాగ్స్ కూడా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం సోషల్ మెసేజ్ తో కూడుకున్నదని ముఖ్యంగా పల్లెటూరిని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకోవాలని తపించే యువ శాస్త్రవేత్త పాత్ర ..రైతుల భూముల్ని కార్పొరేట్ సంస్థలు స్వాహా చేయడంపై పోరాడతాడు.   అని అయితే ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన కత్తి చిత్రం రీమేక్ అని అందరికీ తెలుసు. అయితే ఈ చిత్రం రీమేక్ అయినా పూర్తి తెలుగు నేటీవిటీతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో డైలాగ్స్ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 ఆ డైలాగ్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా..! దుక్కి దున్నడమే తెలుసు వీళ్ళకు.. దుర్మార్గం చెయ్యడం తెలియదు. నాగలి పట్టడమే తెలుసు వీళ్ళకు.. నరకడం తెలియదు’’.. ‘‘వీళ్ల పొలాలకు నీరు ఇవ్వకపోతే.. ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కలను నరుకుతూ మీ గుండెలను దున్నుకుపోతారు’’.. ఇవీ ‘చిరు 150’కి సంబంధించి ప్రచారంలో ఉన్న డైలాగులు. అయితే ఇవి చదవడానికైతే బాగున్నాయి..మరి చిరంజీవి నోటి వెంట ఏంత సీరియస్ గా రానున్నాయో ముందు ముందు వేచి చూడాల్సిందే. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు చిరంజీవి చెప్పిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: