రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యనికి తెలుగు ప్రజలందరు నీరాజనాలందించారు. తెలుగు ఖ్యాతి దశ దిశలల్లా చాటి చెప్పిన బాహుబలి సినిమాతో ప్రపంచ దేశాలు తెలుగు సినిమా ప్రతిభను మెచ్చుకునేలా చెశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రభాస్, రానా పోటా పోటీగా నటించిన బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఓ కొత్త అధ్యానికి నాంధి పలికింది. 


ఇక అది పొందిన అవార్డులు రివార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత ప్రతిష్టాత్మక నేషనల్ అవార్డ్ కూడా కైవసం చేసుకున్న బాహుబలి ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూట్లో ఉంది. అయితే బాహుబలి ది బిగినింగ్ క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న ఈ టైంలో కూడా సినిమాపై బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న దాని మీద రకరకాల జోకులు పేలుతున్నాయి.


ఎవరికి తోచిన ఆన్సర్స్ వారే తయారు చేసుకుంటూ ఇమేజ్ లతో చేస్తున్న ఈ హడావిడి బాహుబలి మీద క్రేజ్ ఎంత ఉందన్నది తెలుస్తుంది. బిగినింగ్ రిలీజ్ అయ్యి ఓ సంవత్సరం అయినా సరే ఇంకా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని తెగ ప్రశ్నలేస్తున్నారు. మరి ఇమేజ్ లతో అలరిస్తున్న ఆ ఆన్సర్స్ ఏంటో మీరు కూడా చూడండి. 


ఇక ఇందులో సప్తగిరిని ఆ క్వశ్చన్ అడిగితే బ్యాక్ లాగ్స్ ఉన్నవాడికి బాహుబలి కథ ఎలా తెలుస్తుంది అన్నది హైలెట్ గా పేలుతుంది. సప్తగిరి కామెడీ స్టిల్ ఒకటి పెట్టి ఏర్పాటు చేసిన ఈ ఇమేజ్ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: