సింగపూర్ లో జరిగిన ‘సైమా’ అవార్డ్స్ వేడుకలలో అత్యుత్సాహంతో సమంత చేసిన రచ్చ పై నాగార్జున తీవ్ర అసహనంతో ఉన్నట్లు టాక్. ఒకవైపు తాను ఒక మెట్టు దిగి వచ్చి చైతన్య సమంతల పెళ్ళికి నాగార్జున తన అంగీకారాన్ని అధికారికంగా తెలియచేయడానికి నాగ్ మానసికంగా సిద్ధ పడుతూ ఉంటే సమంత ‘సైమా’ అవార్డ్స్ వేడుకలలో అంత అతిగా ప్రవర్తించడం నాగార్జునకు ఏమాత్రం నచ్చలేదు అనే గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బుట్టబొమ్మలా తయారై వచ్చిన సమంత ఆ కార్యక్రమానికి వచ్చిన కుర్ర హీరోలందరితోను కలిసి తెగ హడావిడి చేసింది. అంతేకాదు తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ సమంత ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న ఈ డ్రెస్ లో సమంతను చూసిన కొందరు సినిమా సెలెబ్రెటీలకు కూడ మైండ్ బ్లాంక్ అయినట్లు టాక్.

ఒకవైపు టాలీవుడ్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అక్కినేని కుటుంబ కోడలుగా సమంత మారబోతోంది అనే వార్తలు హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సమంత ఈ లుక్ లో కాకుండా కొంత హుందాగా కనిపిస్తే బాగుండేది  అన్న కామెంట్స్ ‘సైమా’ అవార్డ్స్ నైట్ కు వచ్చిన కొందరు ప్రముఖులు చేసినట్లు టాక్.
సమంత ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరబూస్తాయి అన్న కామెంట్స్ ను నిజం చేస్తూ సమంత బన్నీ రానాల మధ్య కూర్చుని సైమాలో యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డును అందుకునే సందర్భంలో వీరు ముగ్గురు ఒకచోటే కూర్చుని చేసిన హంగామా ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారింది.

ఈ వార్తలు నాగ్ దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి అందుకే కాబోలు నాగ్ అసహనంలో ఉన్నాడని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా సమంత చైతన్యల పెళ్ళికి అంగీకరించడానికి నాగార్జున సమంత పెళ్ళి తరువాత సినిమాలలో నటించ కూడదు అన్న కండిషన్ పెట్ట బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే సమంత అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: