అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరోలలో సుశాంత్ కూడ ఒకడు. ఇతడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 8సంవత్సరాలు దాటిపోతున్నా తెలుగు సినిమా ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకోలేకపోయాడు. 

దీనితో ఇతడు డాన్స్ లు బాగా చేస్తాడు అన్న పేరు వచ్చినా అవకాశాలు ఏ మాత్రం రావడం లేదు. అయినా తన వంతు ప్రయత్నంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆటాడుకుందాం రా’ సినిమాకు సంబంధించి ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ఒక సాంగ్ వ్యవహారం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

వివారాలలోకి వెళితే అక్కినేని నాగేశ్వరరావు నటించిన క్లాసిక్ సినిమాలలో అగ్రగామిగా నిలిచే ‘దేవదాసు’ సినిమాలోని 'పల్లెకు పోదాం.. పారును చూదాం.. చలో చలో' పాటను ఈసినిమాలో రీ మిక్స్ సాంగ్ గా మారుస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. టాలీవుడ్ సినిమాలలో రీ మిక్స్ సాంగ్ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు ఏకంగా సుశాంత్ తన తాత అక్కినేని క్లాసిక్ మూవీ దేవదాసు సినిమాలోని పాటను రీ మిక్స్ చేస్తూ ఉండటంతో ఇంతటి సాహసం ఈయంగ్ హీరో ఎందుకు చేస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడ పూర్తయిపోయిందని తెలుస్తోంది. అంత మంచి పాటను ఈ కుర్ర హీరో ఇలా పాడుచేయడం ఏమిటి అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుశాంత్ ఈటాప్ క్లాసిక్ సాంగ్ కు కొత్త విలువలు అద్దకపోయినా కనీసం ఒరిజినల్ సాంగ్ కు ఉన్న వేల్యూను చెడగొట్టకుండా ఉండే శక్తి ఇతడికి ఉందా ? అంటూ ఘాటైన  విమర్శలు  వినిపిస్తున్నాయి. దేవదాసులోని క్లాసిక్ సాంగ్ ఔన్నత్యాన్ని అదే కుటుంబం నుండి వచ్చిన యంగ్ హీరో ఎందుకు పాడుచేస్తున్నాడు అంటూ అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: