తాను ఫేస్ బుక్ ని మ్యానేజ్ చెయ్యడానికే నానా తంటాలూ పడుతున్నాను అనీ ఇక ట్విట్టర్ అంటే ఆలోచిస్తాను కానీ ఖచ్చితంగా వస్తాను అని చెప్పలేను అంటున్నాడు హీరో రామ్ చరణ్. ఫేస్ బుక్ లో ఫాన్స్ తో ముచ్చటించిన చరణ్ చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడాడు. ఎప్పటికప్పుడు ఇలా ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తా అంటున్న చరణ్ విడుదల తేదీ విషయం లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను అని మళ్ళీ మళ్ళీ చెప్పడం విశేషం.

 

చరణ్ - సుకుమార్ ల మధ్యన త్వరలో సినిమా ని టాక్ వచ్చిన నేపధ్యం లో ఒక ఫాన్ అడిగిన ఇదే ప్రశ్న కి తప్పకుండా ఈ సినిమా ఉంటుంది అనీ అక్టోబర్ లో మొదలు అవుతుంది అని చెప్పాడు చరణ్. చిరంజీవి 150 సినిమా కోసం డైరెక్టర్ వినాయక్ చాలా కష్టపడుతున్నారు అని చెప్పిన చరణ్ ఆ సినిమా అవుట్ పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని అన్నాడు. కానీ ఆ సినిమా టైటిల్ విషయం లో " కత్తి లాంటోడు " అనేది అధికారిక టైటిల్ కాదు అని అది కేవలం ఒక పుకారు అని చెప్పుకొచ్చాడు చరణ్.

 " కత్తి సినిమా రీమేక్ కి ప్రచారం లో ఉన్న టైటిల్ కరెక్ట్ కాదు దాని కోసం ఇంకా ఆలోచిస్తున్నాం ఓకే అనుకున్న ఫస్ట్ ఫేస్ బుక్ లోనే ప్రకటిస్తాం " అన్నాడు చరణ్ . " కొందరు స్పెషల్ మెగా అభిమానులని సెలెక్ట్ చేసి అమరీ చిరు 150 షూటింగ్ సెట్స్ లో కలిసే ఏర్పాటు చెయ్యబోతున్నాం " అన్నాడు చరణ్. ఈ న్యూస్ చదివాక మెగా ఫాన్స్ ఖుషీ గా ఉన్నారు. సుకుమార్ సినిమా అక్టోబర్ నుంచి మొదలు పెడతాను అని చెప్పిన చరణ్ అక్టోబర్ 7 న ధృవ విడుదల ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసాడు. ఆగస్ట్ 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ధృవ ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం అన్నాడు. ప్రభాస్ గురించి అడిగినప్పుడు అతను చాలా మంచి ఫ్రెండ్ అనీ ఈ మధ్యనే బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ సెట్స్ లో అతన్ని కలిసా అని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ బ్యానర్ లో సినిమా తీయడం తప్పకుండా జరుగుతుంది అని కాకపోతే ఒక సంవత్సరం టైం పడుతుంది అన్నాడు చరణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: