అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతలా గుర్తుకువస్తుందో...అదే విధంగా పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించిన నదియా పేరు సైతం అందరికి గుర్తుంటుంది. హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని గ్లామర్ లుక్ తో నదియా అందులో నటించి, ప్రేక్షకుల మెప్పుని పొందింది. ఇదిలా ఉంటే తాజాగా నదియాతో ఓ స్టార్ డైరెక్టర్ రొమాన్స్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం నదియా పలు చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉంటుంది. అలాగే తాజాగ నదియ, మురుగదాస్-మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్నచిత్రంలోనూ ఓ పాత్ర చేయనుంది. ఇందులో మహేష్ బాబుకి విలన్ గా చేయనున్న డైరెక్టర్ సూర్యకి భార్య పాత్రలో నదియా కనిపించనుందట.


డైరెక్టర్ ఎస్.జె.సూర్య, నదియాల మధ్య ఓ లవ్ ట్రాక్ కూడ ఉందని, ఇందులో వీరిద్దరూ రొమాన్స్ చేసుకునే సన్నివేశాలు సైతం కొన్ని సెకండ్ల పాటు ఉంటాయని అంటున్నారు. దీంతో మహేష్ మూవీలో డైరెక్టర్ సూర్య, నదియా పాత్రల చాలా వైవిధ్యంగా ఉండనుందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన క్లియర్ డిటైల్స్ మాత్రం త్వరలోనే బయటకు రానున్నాయని అంటున్నారు.


ఇక మహేష్ బాబు మూవీలో విలన్ గా చేస్తున్న సూర్యకి ఇది మంచి బ్రేక్ ఇస్తుందని తను భావిస్తున్నారు. ఒకవేళ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిందంటే...సూర్యకి సైతం మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: