తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు అప్పట్లో శోభన్ బాబు లేని లోటు భర్తీ చేశారని చెబుతారు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా కొన్ని చిత్రాల్లో అద్భుతమైన నటన పండించిన జగపతిబాబు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.  హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు తన కెరీర్ లో ఎప్పుడూ విలన్ పాత్రలు వేయలేదు..కానీ సెకండ్ ఇన్నింగ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినషన్ లో వచ్చిన లెజెండ్ చిత్రంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా వేసిన మొదటి సినిమాలో జగపతిబాబు దుమ్మురేపడంతో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దీంతో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఒకేసారి ఆఫర్ల మీద ఆఫర్లు రావడంతో జగపతి  చాలా బిజీ నటుడు గా మారాడు. అంతే కాదు గతంలో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువే తీసుకుంటున్నారు.

 తెలుగు, తమిళ, మళియాల భాషల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు.  ఇప్పుడు ఈయన్ని చూసి చాలా మంది హీరోలు విలన్లుగా మారడాని ఉత్సాహ పడుతున్నారు.  తాజాగా హాలీవుడ్ దర్శకదిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ది బీఎఫ్‌జీ’కి జగపతిబాబు వాయిస్ అందించిన విషయం తెలిసిందే.   ఈ చిత్రం చిన్నా పెద్ద అందరినీ ఆకర్షిస్తుందని అంటున్నారు.

అంతే కాదు  దర్శకుడు స్పీల్‌బర్గ్‌తో తనకు చాలా ఇష్టమని హాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందింని అతనితో ఒక్క ఫోటో దిగాలనే తాను ఈ సినిమాకు వాయిస్ అందించినట్లు చెప్పారు జగపతిబాబు.  ప్రస్తుతం తనకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ స్పిల్ బర్గ్ పై ఉన్న అభిమానంతో తాను డబ్బింగ్ చెప్పినట్లు చెబుతున్న జగపతి బాబు  స్పీల్‌బర్గ్ తో ఇంకా ఫొటో దిగడం పూర్తవలేదని వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: