తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదల అంటే ప్రపంచ వ్యాప్తంగా పండుగ చేసుకునే ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం భారత దేశంలోనే కాకుండా జపాన్, చైనా,సింగపూర్,మలేషియా లాంటి దేశాల్లో కూడా రజినీకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మద్య విడుదలైన రోబో చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఊపు ఊపింది. తాజాగా రజినీకాంత్ నటించిన కబాలి చిత్రంతో జూలై 22 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతునన్న విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
'Kabali' fever
తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం రజనీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్ఆర్ఐ ఫ్యాన్స్‌కు ‘కబాలి’ బంపర్ ఆఫ్ ఇస్తున్నాడు. ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న కబాలి తొలి షో అమెరిలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది.  భారత కాలమానం ప్రకారం ఈ చిత్రం 21వ తేదీ ఉదయం 11 గంటలకు అమెరికా అభిమానుల కోసం ప్రదర్శించబడుతుంది. అంటే దాదాపు 24 గంటల ముందే భారతీయులకంటే ప్రవాస భారతీయులు ఈ సినిమా చూసే అవకాశం దక్కించుకుంటున్నారన్నమాట.

అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన యువ దర్శకుడు రంజిత్ పా దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున అంచనాలు పెరిగిపోయాయి. ఇక తమిళ నాట అయితే కబాలి మానియా సోకింది అనే చెప్పాలి.  ఈ చిత్ర టీజర్, పాటలు ఇప్పటికే విశేష ఆదరణ పొందడం, సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రజనీ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా తొలిసారి అమెరికాలో 400 స్క్రీన్లలో పదర్శనకు సిద్ధమై రికార్డు సృష్టించబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: