ఈ మద్య ఇంటర్నెట్ సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి కొంతమంది తెగ తహ తహలాడుతున్నారు. అయితే దీని ద్వారా కొంత మంది పాపులారిటతో పాటు ప్రాణ గండాలు కూడా మీదకు తెచ్చకుంటున్నారు. భారత దేశంలో గోల్డ్ మ్యాన్ గా పేరు పొందిన ద త్త ఫుగె (48)ని అతని ప్రత్యర్ధులు దారుణంగా హ త మార్చారు. తాజాగా పాకిస్థాన్ ఇంటర్నెట్‌ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్‌లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.సోషల్ మీడియాలో ఫేమస్‌ కావడంతో ఖందిల్ బలోచ్‌కు గతంలోనే పలుసార్లు ఛాందసవాదుల నుంచి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రత కోసం ఆమె పాక్ హోంశాఖకు విజ్ఞప్తి చేసినా.

హోంశాఖ స్పందించలేదు. ఖందిల్ తాజాగా విడుదల చేసిన ’బ్యాన్’ అనే మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పాకిస్థాన్‍ లో పెద్ద చర్చను లేవనెత్తింది. సోషల్ మీడియాలో ఫొటొలు పెట్టి.. కామెంట్లు చేయడం ద్వారా ఫేమస్ అయిన ఖందిల్ ను పాక్ పూనం పాండేగా పేరు తెచ్చుకుంది.  ఇటీవలే కండీల్ బలోచ్ తనను చంపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు సెక్యూరిటీ పెంచాలని కోరింది. పాకిస్థాన్ మోడల్‌తో సెల్ఫీ: పదవి పోగొట్టుకున్న మతాధికారి ఇంతలోనే ఈ సంఘటన జరగడం దురదుష్టకరం. సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని కండీల్ బలోచ్ సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన వీడియోలను పోస్టు చేసి అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకునేది. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్థాన్ జట్టు గెలిస్తే నగ్నంగా డాన్స్ చేస్తానని ప్రకటన చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేయాలని తన మనసులోని కోరికను బహిరంగంగా వీడియో రూపంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ముల్తాన్‌లోని తన సొంతూరు ముజఫర్‌బాద్ గ్రీన్‌టౌన్‌కు బలోచ్ ఈద్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు వెళ్లింది. అయితే, ఇంటర్నెట్‌లో ఫొటోలు పెడుతుండటంపై ఆమె సోదరుడు ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది.సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: