కృష్ణం వందే జగద్గురుం సినిమా డైలాగులు మనం ఎప్పటికీ మరచిపోలేం. డైరెక్టర్ క్రిష్ ద్వారా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫెయిల్యూర్  గా మిగిలింది గానీ సినిమా లో ఉన్న చాలా సన్నివేశాలూ మరీ ముఖ్యంగా వాటిని పండించిన సాయి మాధవ్ బుర్రా డైలాగులు అద్భుతంగా వచ్చాయి.ఆ తరవాత గోపాల గోపాల, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు , కంచె లాంటి క్లాసిక్ సినిమాలతో వరసగా అతనికి మంచి పేరు వచ్చేసింది.

 

బాహుబలి చిత్రం అప్పుడు కూడా  మొదట డైలాగ్ రైటర్ గా సాయి పేరు వినిపించినా కూడా చివరి నిమిషం లో అనుకోని కారణాల వలన అతను తప్పుకున్నాడు. స్టార్ హీరోల సాన్నిహిత్యం తో చాలా పెద్ద సినిమాలకి ప్రస్తుతం డైలాగులు రాస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తనకి తానుగా అతని డైలాగులు నచ్చి మరీ గోపాల గోపాల కి డైలాగ్స్ రాయించుకోవడం విశేషం. సెట్స్ లో ఉండి అంతా చూసుకుని మరీ డైలాగులు రాయాలి అని పవన్ కళ్యాణ్ అతన్ని గోపాల గోపాల షూటింగ్ టైం లో పిలిపించాడు. అంతటి రేంజ్ ఉన్న డైరెక్టర్ అవడం తో చిన్న సినిమాల వారు అతనికి మంచి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మెగా స్టార్ చిరంజీవి నుంచి సాయి కి పిలుపు వచ్చింది.

 

స్వయంగా చిరు సాయి మాధవ్ కి ఫోన్ చేసి తన సినిమాకి పని చెయ్యమని కోరడం టాలీవుడ్ లో హాట్ హాట్ టాపిక్ గా మారింది. మెగా స్టార్ చాలా ప్రతిష్టాత్మకం గా తీసుకున్న ఆయన 150 చిత్రం కోసం సాయి మాధవ్ ని కొన్ని కీలక సన్నివేశాల్లో డైలాగుల కోసమం అతన్ని పిలిపించారు అని తెలుస్తోంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ఆరేడు సన్నివేశాల్ని అతడి చేత రాయించేందుకు చిరు ప్లాన్ చేసి సాయిమాధవ్ ని పిలిపించారుట. ఆ ఆరేడు సీన్స్ సినిమాకి అత్యంత కీలకం అని తెలుస్తోంది. పరుచూరి సోదరులు డైలాగ్ రైటర్ లు గా పని చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ కార్డ్ లో కూడా వారి పేరే కనిపిస్తుంది గానీ సాయి మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో తన వంతు సాయం చేస్తున్నాడు అని యూనిట్ సభ్యుల ద్వారా మనకి తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: