టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాన్ నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన మూవీలో కేవలం తన అభిమానులని మాత్రమే ఉద్ధేశించుకొని స్టోరీని రెడీ చేసుకుంటారు. ఈ ఫార్ములానే పవన్ కళ్యాణ్ సినిమాలకి సక్సెస్ అనేది అందుతుంది.

ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్ మూవీ తరువాత పవన్ కళ్యాన్ తన మూవీలకి సొంతంగా స్క్రిప్ట్ ని రాసుకోవటం చేస్తున్నారు. ఇతర డైరెక్టర్స్ పవన్ కళ్యణ్ తో  పనిచేస్తున్నప్పటికీ, వారు పవన్ కళ్యాణ్ తో స్క్రిప్ట్ పనుల్లో పాల్గొనక తప్పటం లేదు. ఆ విధంగా వచ్చిన మూవీనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’. అయితే పవన్ కళ్యాణ్ స్క్రిప్టింగ్ పనులు చేయటం కారణంగానే తన మూవీలు  కొంత నష్టపోతున్నాయనేది కొంత మంది విమర్శకుల వాదన.

ఏది ఎలా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ కి మాత్రం తన మూవీలకి తనే స్క్రిప్ట్ ని సమకూర్చుకోవటం వెరీ కంఫర్ట్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం పవన్, దర్శకుడు ‘డాలి’ దర్శకత్వంలో నటించనున్నాడు. డాలి ఇప్పటికే గోపాల గోపాల వంటి సక్సెస్ మూవీకి పని చేశారు. ఇంతటి సక్సెస్ ని ఇండస్ట్రీకి ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం దర్శకుడు డాలీ, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు తను రాసుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలు డాలి పై బలంగా ప్రభావితం చూపుతున్నాయనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. దీంతో ఈ మూవీపై సైతం ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో అనేది ఫిల్మ్ నగర్ లో ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: