రజినీకాంత్ సినిమా కబాలి ఎల్లుండి విడుదల కి సిద్దం అవుతోంది. ఈ సినిమా విడుదల కి నెలకొన్న సందడి అంతా ఇంతా కాదు. బెంగళూరు , చెన్నై లలో ఏకంగా శెలవులు కూడా ప్రకటించేశారు ప్రైవేటు కంపెనీలకి. ఎన్నడూ లేనంతగా టికెట్ల విషయం లో కూడా భారీ క్యూలు, హడావిడి నెలకొన్నాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఈ సినిమాని ఫుడ్ తో సహా అందిస్తున్న కొత్త రికార్డు నెలకొల్పింది ఈ సినిమా. ఇప్పటికే ఇంటర్నేషనల్ విడుదల కి సర్వం సిద్దం అయ్యింది.

 

విడుదల రోజున కలక్షన్ లు ఎన్నెన్ని రికార్డులు పగలగోడతాయి అనే అంచనాలతో బాటు భారీ బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయి. కొత్త డైరెక్టర్ రంజిత్ మీద రజినీకాంత్ కి బాగా నమ్మకం ఉంది ఈ ప్రాజెక్ట్ ని ఆయన చాలా సీరియస్ గా తీసుకుని మనసు పెట్టి చేసాడు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ విషయం లో ఇప్పుడు చాలా సంచలన వార్తలు బయటకి వస్తున్నాయి. ఈ స్టొరీ ని చెబుతున్నప్పుడు రంజిత్ ఈ కథ లో నెగెటివ్ క్లైమాక్స్ ని చెప్పారట దానికి రజిని ఓకే అన్నారు గానీ ఆయన కూతురు సౌందర్య మాత్రం సంతృప్తి చెందలేదట.

 

ఈ క్లైమాక్స్ మార్చి తీసుకుని రావాలని కోరినా అతను తీసుకుని రాలేదు, రజినీకాంత్ మాత్రం ఆ క్లైమాక్స్ కే ఫిక్స్ అవుదాం అని అన్నారట. సరే అని అదే నెగెటివ్ ఎండింగ్ తో సినిమా తీసేశారు. తమిళ జనాలు యాంటీ క్లైమాక్స్ కి ఎలాగోలా కనక్ట్ అవుతారు గానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి యాంటీ క్లైమాక్స్ లు అస్సలు ఒప్పుకోరు. యాంటీ క్లైమాక్స్ లు అంటే హీరో జైలుకి వెళ్ళడం, రోడ్డున పడ్డం , చనిపోవడం ఇలాంటివి అన్న మాట. సో హీరో చనిపోయే పరిస్థితి వస్తే తమిళం లో చాలా పాజిటివ్ గా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి గానీ తెలుగు లో ఛాన్స్ కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న తరవాత తెలుగు లో ఎక్కువ రేటు పెట్టి కొన్న డిస్ట్రిబ్యూటర్ లు గజ గజ లాడిపోతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: