ఒక ముఖ్యమంత్రి కొడుకుతో లేదా మాజీ ముఖ్యమంత్రి కొడుకుతో పెట్టుకుంటే ఏమైనా ఉందా ? ఎదో ఒక పలుకుబడి ఉపయోగించి మనల్ని రివర్స్ లో ఇబ్బంది పెడతారు. మన మీద పాత కేసులో, పాత ఇబ్బందికర విషయాలో బయటకి లాగి మరీ మనకి చుక్కలు  చూపిస్తారు. ఇప్పుడు జగపతి బాబు ఇలాంటి పనే చేస్తున్నాడు. కానీ రియల్ లైఫ్ లో కాదు లెండి రీల్ లైఫ్ లోనే.

 

హీరోగా తనకంటూ సూపర్ ఇమేజ్ ఉన్న జగపతి బాబు కాలానికి తగ్గట్టు మారి విలన్ అయ్యాడు. హీరో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్న ఆయన తన పాత్రల స్వరూపాన్ని మార్చుకుంటూ దూసుకుని పోతున్నాడు. నాన్నకు ప్రేమతో లో విలన్ గా అయినా శ్రీమంతుడు లో నాన్నగా చేసిన అదంతా జగపతిబాబు కే చెల్లింది. ఒక పక్క విలన్ గా ఒక పక్కా తండ్రి పాత్రల్లో అద్భుతమైన నటన కనబరుస్తూ సాగుతున్నాడు జగపతి బాబు. టాలీవుడ్ తో పాటు కన్నడా పరిశ్రమ లో కూడా మంచి ఆఫర్లు వస్తుంటే కాదనలేక అటు వైపు అడుగులు వేస్తున్నాడు.

 ప్రస్తుతం కన్నడ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ్ హీరోగా చేస్తున్న సినిమాలో బాబు విలన్ పాత్ర చేస్తున్నాడు. కీలక రోల్ కావడం తో జగపతి బాబే కావాలి అని యూనిట్ అంతా పట్టు బట్టిందట దానికోసం కాదనలేక జగపతి బాబు ఒప్పుకున్నాడు అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ బయటకి రావడం తో జగపతి క్యారెక్టర్ తెలుస్తోంది.సినిమా రిచ్ గా ఉండటంతో పాటు.. యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉండటం.. కొడుకు సినిమాను మాజీ ముఖ్యమంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న వైనం ఈ టీజర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: