టాలీవుడ్ కి సంబంధించినంత వరకూ పెద్ద నిర్మాతల్లో అల్లూ అరవింద్, సురేష్ బాబు ల పేర్లు బాగా వినిపిస్తాయి. వీరిద్దరి మీదా ఎప్పుడూ ఎదో ఒక రకమైన ఆరోపణలు వస్తూనే ఉంటాయి. నిర్మాత ల టాప్ లిస్టు లో ఉండే వీరిద్దరి మీదా ఆరోపణలు రావడం అది కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి వెళ్ళిపోతున్నచైర్మన్ చేసేవి కావడం తో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. తెలుగు నిర్మాతల మండలి కి అధ్యక్షుడు గా ఆర్కే గౌడ్ కి మరొక ఏడాది పదవీ కాలం ఉన్నా కూడా ఆయన్ని ఇప్పుడే సాగనంపే ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు.



" నేను చిన్న ,మధ్య నిర్మాతలకి మద్దతుగా ఉంటున్నాను. ఏడూ నెలల నుంచీ యూఎఫ్ఓ మీద పోరాటం చేస్తున్నాను. ఇతర రాష్ట్రాల్లో 3 వేలు వసూలు చేస్తుంటే ఇక్కడ మాత్రం ఏకంగా 11 వేలు వసూలు చేస్తున్నారు. అందుకే ఈ విషయం లో మేము పోరాటానికి దిగాం. కమిటీ వేస్తాం అంటున్నారు గానీ ఇప్పటి వరకూ ఏమీ జరగలేదు " అనిగౌడ్ చెబుతున్నారు. అల్లూ అరవింద్, సురేష్ బాబు లు యూఎఫ్ఓ లో వాటాలు పెట్టబట్టి, పెట్టుబడులు ఉండబట్టీ ఈ రకంగా వ్యవపర ప్రయోజనాల కోసం తన పదవీకాలం ఉన్నా కూడా తొలగించే పనిలో బిజీ గా ఉన్నారు అని అంటున్నారు గౌడ్. "నేను విజేందర్ రెడ్డి కలిసి చాలా పోరాటం చేసాము, అందుకే ఆయన్ని ముందుకుతీసుకొచ్చి మరీ నన్ను అడ్డం తొలగించాలి అని చూస్తున్నారు "

మరింత సమాచారం తెలుసుకోండి: