హీరో మమ్ముట్టి అంటే మన దగ్గర పెద్ద ఫేం లేదు గానీ మలయాళం లో పిచ్చ క్రేజ్ ఉంది. ఆయన కొత్త సినిమా కసాబా ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కుంది. తాజాగా ఆయన నటించిన ఈ సినిమా లో మహిళల మీద అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి అని చెబుతున్నారు. రంజాన్ సందర్భంగా కసాబా సినిమా విడుదల అయ్యింది కేరళ లో ఇందులో మాట్లాడే కొన్ని మాటలు మహిళల ని తీవ్రంగా కించ పరుస్తున్నాయి అని మహిళా సంఘాలు సీరియస్ అవుతున్నాయి.

ఒక మహిళా పోలీస్ అధికారిని ఉద్దేశించి హీరో మాట్లాడే మాటలు చాలా అసభ్యకరంగా ఉన్నాయి అనీ మహిళల మనసు నొప్పించే విధంగా అవి సాగాయి అనీ చెబుతున్నారు. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి విమర్సల పర్వం నడుస్తోంది. హిట్ తో పాటు విమర్శలు సినిమాకి ప్లస్ అయ్యి క్రేజ్ ని తెచ్చింది కానీ హీరో కి మాత్రం తలనొప్పిగా మారుతోంది. హీరో మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్ కి మహిళల మీద రాసే డైలాగులలో జాగ్రత్త తీసుకోవడం అనే మినిమం ఆలోచన డైరెక్టర్ కి లేకుండా ఎలా పోయింది అనీ అలాగే మమ్ముట్టి సైతం ఇలాంటి విషయాలు చూసీ చూడనట్టుగా ఎలా వదిలేసాడు అనీ అంటున్నారు ఫాన్స్.

మొదటి రోజునే ఈ డైలాగుల మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి, కానీ సినిమా ఎలాగో హిట్ అయ్యింది కదా అని ప్రొడ్యూసర్ లు లైట్ తీసుకున్నారు. ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లు సైతం ఈ వ్యాఖలు హీరో కి ఇబ్బంది కలిగిస్తాయి అనీ తీసేయమనీ కోరారు గానీ ప్రొడ్యూసర్ లు పట్టించుకోలేదు. వీటి పర్యసవసానం ఇప్పుడు ఎదురు అవుతోంది. ఇప్పుడు కేరళ మహిళా కమీషన్ మొత్తం మమ్ముట్టి తో పాటు డైరెక్టర్ కీ నిర్మాతకీ కూడా నోటీసులు పంపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: