మహేష్ బాబు బ్రాండ్ అండార్స్ మెంట్లు చూడటమే కాకుండా మహేష్ నటించబోయే కథల ఎంపికలో కీలక పాత్ర నమ్రత వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె వ్యూహాత్మక ఎత్తుగడ వల్ల ఏకంగా మహేష్ తీసుకునే పారితోషికం 25 కోట్ల స్థాయికి చేరుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే ‘జనతా గ్యారేజ్’ విడుదల తరువాత కొరటాల శివ మహేష్ కాంబినేషన్ లో చేయబోయే సినిమాకు మహేష్ కు 25 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘బ్రహ్మోత్సవం’ సూపర్ ఫ్లాప్ అయిన తరువాత కూడ మహేష్ కు ఈ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేయబడటం అందరి మైండ్ ను బ్లాంక్ చేస్తోంది. 

మురగదాస్ సినిమాకు 20, ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు 22 కోట్లు తీసుకున్న మహేష్ బాబు ఈ సినిమాకు 25 కోట్లు తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది.  మురగదాస్ సినిమా తరువాత మహేష్ కు తమిళనాడు మార్కెట్ కూడా బాగా పెరుగుతుందని అందువల్ల 25కోట్లు పెద్ద అమౌంట్ కాదని నమ్రత చాల వ్యూహాత్మకంగా మాట్లాడి ఈ డీల్ సెట్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. 

దీనికితోడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివకు కూడ 14 కోట్ల పారితోషికం ఈసినిమా నిర్మాత దానయ్య ఆఫర్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ డైరక్టర్ కూడ 10 కోట్లకు మించి పారితోషికం తీసుకోలేదు అన్న వార్తలు ఉన్నాయి. త్రివిక్రమ్ ‘అ..ఆ’ కు 9 కోట్లు, వివి వినాయక్ ‘అల్లుడు శీనుకు’ 10 కోట్లు తీసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలుహడావిడి చేసిన విషయం తెలిసిందే. అయితే వీరందరికంటే రాజమౌళికి ‘బాహుబలి’ వల్ల  భారీ పారితోషికం అందుతూ ఉన్నా అది లాభాలలో లెక్క కాబట్టి ఈ లిస్టులోకి రాదు అని అంటున్నారు.  దీనితో కొరటాల తీసుకుంటున్న 14 కోట్ల పారితోషికం టాలీవుడ్ రికార్డుగా మారిపోయింది. ఈ సినిమా కూడ 100 కోట్ల ప్రాజెక్ట్ గా మారుతూ ఉండటంతో ప్రస్తుతం మహేష్ క్రేజ్ ను చూసి టాలీవుడ్ షేక్ అయిపోతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: